Motorola 600W Dolby Atmos 5.1 soundbar available with huge deals
600W Dolby Atmos 5.1 సౌండ్ బార్ ఈరోజు భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది. స్మార్ట్ టీవీకి తగిన పవర్ ఫుల్క్ బ్రాండెడ్ సౌండ్ బార్ కొనాలని ఎదురు చూస్తున్న వారు ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ డీల్ ను పరిశీలించవచ్చు. ఈ సౌండ్ బార్ కంప్లీట్ సెటప్ తో వస్తుంది మరియు గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది.
ఈ బిగ్ సౌండ్ బార్ డీల్ విషయానికి వస్తే, మోటోరోలా యొక్క AmphisoundX సిరీస్ నుంచి వచ్చిన Dolby Atmos 5.1 సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 66% భారీ డిస్కౌంట్ అందుకుని కేవలం రూ. 16,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తోంది.
ఈ సౌండ్ బార్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి HDFC మరియు BOBCARD తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ మోటోరోలా సౌండ్ బార్ ని కేవలం రూ. 15,499 రూపాయల ఆఫర్ ధరకే సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.
Also Read: Vivo T4x 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ కంటే ముందే లీకైన ప్రైస్ వివరాలు.!
ఈ మోటోరోలా సౌండ్ బార్ మూడు ఫ్రంట్ స్పీకర్లు మరియు అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన స్టన్నింగ్ బార్, రెండు రియర్ శాటిలైట్ స్పీకర్లు మరియు గొప్ప BASS సౌండ్ అందించే సబ్ ఉఫర్ కలిగిన 5.1 సెటప్ తో వస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ 600W పవర్ ఫుల్ సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది.
ఈ మోటోరోలా సౌండ్ బార్ Dolby Atmos సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ తో గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI, బ్లూటూత్ 5.3, ఆప్టికల్ , AUX మరియు USB వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కూడా కలిగి ఉంటుంది.