LG latest Dolby Atmos Soundbar today available at discount price on flipkart
జబర్దస్త్ సౌండ్ అందించే LG Dolby Atmos Soundbar పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ జబర్దస్త్ ఆఫర్ లను అందించింది. కంప్లీట్ సౌండ్ ఫీచర్స్, జబర్దస్త్ సబ్ ఉఫర్ మరియు కంప్లీట్ కనెక్టివిటీ కలిగి ఉన్న లేటెస్ట్ LG సౌండ్ బార్ ను ఈరోజు మంచి ఆఫర్ ధరకు అందుకునే అవకాశం ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించింది. పిక్చర్ పర్ఫెక్ట్ స్మార్ట్ టీవీకి సౌండ్ పర్ఫెక్ట్ జోడీగా ఉండే ఈ సౌండ్ బార్ డీల్ గురించి తెలుసుకోండి.
2022 సంవత్సరంలో గొప్ప ఫీచర్స్ తో LG అందించిన Meridian సిరీస్ సౌండ్ బార్ LG SP8A పై ఈరోజు 58% భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ ను ఈరోజు రూ. 24,990 ధరకు ఆఫర్ చేస్తోంది, ఇంతటితో ఈ సౌండ్ బార్ ఆఫర్ ముగిసిపోలేదు. ఈ సౌండ్ బార్ పై రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ ను కూడా అందించింది.
ఈ సౌండ్ బార్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి SBI మరియు BOBCARD లతో EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి ఈ రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ రూ. 23,490 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది.
Also Read: BSNL Plan: నెలకు కేవలం రూ. 100 ఖర్చుతో కంప్లీట్ బెనిఫిట్స్ అందించే చీప్ అండ్ బెస్ట్ ప్లాన్ ఇదే.!
ఈ LG సౌండ్ బార్ 3.1.2 ఛానల్ సెటప్ తో వస్తుంది. అంటే, రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు, 3 ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్ మరియు సబ్ ఉఫర్ ను కలిగి ఉంటుంది. ఈ సెటప్ లోని బార్ 50W అందించే రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు, మూడు 40W ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు మరియు 20mm సిల్క్ డూమ్ ట్వీటర్ లను కలిగి టోటల్ 220W సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ తో వచ్చే సబ్ ఉఫర్ 220W జబర్దస్త్ BASS సౌండ్ అందిస్తుంది.
ఈ సౌండ్ బార్ Dolby Atmos, LPCM, Dolby TrueHD, Dolby Digital Plus, DTS:X, DTS-HD Master Audio మరియు మరిన్ని డాల్బీ మరియు డీటీఎస్ సౌండ్ ఫార్మాట్ లకు సపోర్ట్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ రూమ్ కాలిబ్రేషన్ తో మంచి లీనమయ్యే సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI eArc, USB, ఆప్టికల్, Wi-Fi, బ్లూటూత్ 5.0 మరియు Alexa సపోర్ట్ లను కలిగి ఉంటుంది.