LG Dolby Atmos సూపర్ సౌండ్ బార్ ఈరోజు ఆల్ టైమ్ తక్కువ ధరలో లభిస్తోంది.!

HIGHLIGHTS

LG Dolby Atmos సూపర్ సౌండ్ బార్ ఈరోజు ఆల్ టైమ్ తక్కువ ధరలో లభిస్తోంది

ఈ సౌండ్ బార్ 3.1.3 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది

ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ మరియు DTS:X రెండు సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ లు కలిగి ఉంటుంది

LG Dolby Atmos సూపర్ సౌండ్ బార్ ఈరోజు ఆల్ టైమ్ తక్కువ ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ 3.1.3 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఇది మాత్రమే కాదు, ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ మరియు DTS:X రెండు సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ లు కలిగి ఉంటుంది. ఈ ఎల్ జి సౌండ్ బార్ ప్రీమియం డిజైన్, ప్రీమియం ఫీచర్స్ మరియు ప్రీమియం సెటప్ తో వస్తుంది.

LG Dolby Atmos సౌండ్ బార్: ఆఫర్స్

ఎల్ జి యొక్క 3.1.3 ఛానల్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ S77TY ఈరోజు ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ ఆఫర్ ధరలో లభిస్తుంది. మీ అవకాశాన్ని బట్టి ఈ సౌండ్ బార్ ను ఈ రెండు ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ లో ఏదైనా ఒక దాని నుండి తీసుకోవచ్చు. ఈ సౌండ్ బార్ ఈరోజు 55% భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 24,990 ధరతో సేల్ అవుతోంది.

ఈ సౌండ్ బార్ ను అమెజాన్ BOB VISA డెబిట్ కార్డ్, IDFC FIRST మరియు HSBC క్రెడిట్ కార్డ్ తో తీసుకునే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, ఈ సౌండ్ బార్ ను ఫ్లిప్ కార్ట్ నుంచి Canara బ్యాంక్ మరియు SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో తీసుకునే వారికి కూడా రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ఈరోజు కేవలం రూ. 23,490 రూపాయల అతి తక్కువ ధరలో మీకు అందుతుంది. Buy From Here

Also Read: OPPO K14x 5G ఆకట్టుకునే ఈ టాప్ 5 ఫీచర్స్ తో లాంచ్ అవుతోంది.!

LG Dolby Atmos సౌండ్ బార్: ఫీచర్స్

ఈ ఎల్ జి సౌండ్ బార్ 3.1.3 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 400W జబర్దస్త్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇందులో ఒక బార్ మరియు వైర్లెస్ సబ్ ఉఫర్ ఉంటాయి.ఈ సౌండ్ బార్ తో వచ్చే బార్ ప్రీమియం డిజైన్ మరియు సెటప్ కలిగి ఉంటుంది. ఇది చాలా స్లీక్ అండ్ స్టన్నింగ్ డిజైన్ తో ఉంటుంది. ఈ బార్ లో ముందు మూడు ఫ్రంట్ ఫైరింగ్ మరియు పైన మూడు అప్ ఫైరింగ్ స్పీకర్లు ఉంటాయి. ఇది బార్ ఉన్న ప్లేస్ నుంచే కంప్లీట్ సరౌండ్ సౌండ్ అందించే విధంగా ట్యూన్ అండ్ సెటప్ చేయబడింది.

ఇక సౌండ్ టెక్నాలాజి విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ మరియు DTS:X రెండు సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ లను కలిగి ఉంది. ఇది కాకుండా ట్రిపుల్ లెవల్ స్పేషియల్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇది సూపర్ సరౌండ్ మరియు ఫీచర్స్ తో సినిమా థియేటర్ వంటి జబర్దస్త్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇందులో HDMI, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :