బిగ్ డిస్కౌంట్ తో 5 వేలకే 200W 5.1 Soundbar అందుకోండి.. ఎక్కడంటే.!

Updated on 25-Feb-2025
HIGHLIGHTS

బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ కలిగిన మంచి సౌండ్ బార్

200W 5.1 Soundbar ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో లభిస్తోంది

కేవలం 5 వేల రూపాయల బడ్జెట్ ధరలో మంచి సౌండ్ బార్ అందుకోండి

బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ కలిగిన మంచి సౌండ్ బార్ కోసం చూస్తున్నారా? అయితే , ఈ రోజు అమెజాన్ ఇండియా నుంచి ఈరోజు ఒక మంచి సౌండ్ బార్ డీల్ అందుబాటులో ఉంది. ఇండియన్ మార్కెట్ లో రీసెంట్ గా విడుదలైన ఒక 200W 5.1 Soundbar ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం 5 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తోంది.

ఏమిటా 200W 5.1 Soundbar సౌండ్ బార్ ఆఫర్?

GOVO ఇటీవల విడుదల చేసిన 200W 5.1 సౌండ్ బార్ GoSurround 955 ఈరోజు 71% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 5,808 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ను BOBCARD తో కొనుగోలు చేసే వారికి రూ. 580 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బీర్ కేవలం రూ. 5,228 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ పై మరిన్ని బ్యాంక్ ఆఫర్స్ కూడా అమెజాన్ అందించింది. Buy From Here

Also Read: Thomson Jio TV: బడ్జెట్ ధరలో మంచి ఫీచర్స్ తో ఆకట్టుకుంటోంది.!

GOVO 200W 5.1 Soundbar : ఫీచర్స్

ఈ గోవో సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో మూడు స్పీకర్లు కలిగిన బార్, రెండు వైర్డ్ శాటిలైట్ స్పీకర్లు మరియు సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ డిజిటల్ సిగ్నల్ ప్రోసెసర్ (DSP) సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప బ్యాలెన్స్ సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ కాంపాక్ట్ సైజులో వస్తుంది.

ఈ గోవో సౌండ్ బార్ టోటల్ 200W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ HDMI (ARC), AUX, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ 5.3 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ 3D సౌండ్ ఫీచర్ తో వస్తుంది. అయితే, ఈ సౌండ్ బార్ లో డాల్బీ లేదా డిజిటల్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లేక పోవడం లోటుగా చెప్పొచ్చు. కానీ, కేవలం 5 వేల రూపాయల బడ్జెట్ లో లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ లలో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :