get flipkart bbd sale big deal on MOTOROLA Dolby Atmos soundbar
MOTOROLA Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ BBD సేల్ నుంచి బిగ్ డీల్ అందించింది. అదేనండి, ఫ్లిప్ కార్ట్ ఈరోజు నుంచి ప్రారంభించిన బిగ్ బచాత్ డేస్ సేల్ నుంచి ఈ డీల్ అందించింది. ఈ సేల్ జూలై 1వ తేదీ, అంటే ఈరోజు నుంచి ప్రారంభం అయ్యింది మరియు ఈ సేల్ జూలై 5వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సేల్ నుంచి ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ మోటోరోలా సౌండ్ బార్ డీల్ పై ఒక లుక్కేద్దామా.
మోటోరోలా ఇండియన్ మార్కెట్లో అందించిన బడ్జెట్ 5.1 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ AmphisoundX సౌండ్ బార్ పై ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు 68% భారీ అందుకొని రూ. 15,999 రూపాయల ప్రైస్ తో సేల్ అవుతోంది. అయితే, ఈ సౌండ్ బార్ పై సేల్ నుంచి అందించింది బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో మరింత తక్కువ ధరకే లభిస్తుంది.
అదేమిటంటే, ఈ మోటోరోలా డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ని BOBCARD EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 14,499 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది.
Also Read: Moto G96 5G: మోటోరోలా G సిరీస్ నుంచి పవర్ ఫుల్ ఫోన్ లాంచ్ చేస్తోంది.!
ఈ మోటోరోలా డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 600 W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ మోటోరోలా సౌండ్ బార్ సెటప్ లో ముందు మూడు స్పీకర్లు మరియు పైన రెండు స్పీకర్లు కలిగిన బార్, వైర్లెస్ శాటిలైట్ స్పీకర్లు మరియు సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ కంప్లీట్ సెటప్ మరియు ఇంటిని షేక్ చేసే 8 ఇంచ్ ఉఫర్ స్పీకర్ ఉంటుంది.
ఈ మోటోరోలా సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ లో మంచి సౌండ్ అందించడానికి వీలుగా ఆంప్లిఫైర్ సపోర్ట్ ను కూడా ఈ సౌండ్ బార్ లో అందించింది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ మూడు 3D ఆడియో మోడ్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ HDMI ఇన్, HDMI Arc, USB, ఆప్టికల్, AUX మరియు బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.