Flipkart Sale big deal on ZEBRONICS powerful soundbar
ప్రముఖ ఇండియన్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ZEBRONICS యొక్క పవర్ ఫుల్ సౌండ్ బార్ పైన ఫ్లిప్ కార్ట్ సేల్ జబర్దస్త్ ఆఫర్. ఫ్లిప్ కార్ట్ రీసెంట్ గా ప్రకటించిన బిగ్ ఇయర్ ఎండ్ సేల్ నుండి ఈ ఆఫర్ ను అందించింది. డిసెంబర్ 12 న ప్రకటించిన ఈ బిగ్ ఇయర్ ఎండ్ సేల్ డిసెంబర్ 16న ముగుస్తుంది. అంటే, ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న ఈ బెస్ట్ ఆఫర్ రేపటితో ముగుస్తుంది. అందుకే, ఈ బెస్ట్ డీల్ ను మీకోసం అందిస్తున్నాను.
ఫ్లిప్ కార్ట్ బిగ్ ఇయర్ ఎండ్ సేల్ నుండి జీబ్రానిక్స్ జ్యూక్ బార్ 9000 ప్రో సౌండ్ బార్ 76% భారీ డిస్కౌంట్ తో రూ. 6,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ డిస్కౌంట్ ను MRP ధర పైన అందించింది. అయితే, వాస్తవానికి నిన్న మొన్నటి వరకూ ఈ సౌండ్ బార్ 8,999 రూపాయల ధరకు సేల్ అయ్యింది. అంతేకాదు, ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుండి 4.3 రేటింగ్ మరియు మంచి రివ్యూలను అందుకుంది.
Also Read : POCO C65: స్లిమ్ డిజైన్, స్టన్నింగ్ ఫీచర్స్ తో చవక ధరలో వచ్చింది.!
ఇక మనం మాట్లాడుకుంటున్న ఈ సౌండ్ బార్ ప్రత్యేకల విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ ఆకర్షణీయమైన సెటప్ మరియు ఫీచర్స్ తో వస్తుంది. ఈ జీబ్రానిక్స్ సౌండ్ బార్ నాలుగు 7cm స్పీకర్లు మరియు రెండు 2.5cm ట్వీటర్ లతో వస్తుంది. ఈ బార్ తో సెపరేట్ సబ్ ఉఫర్ 16.5cm స్పీకర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 120W RMS సౌండ్ అందిస్తుంది.
ఈ జీబ్రానిక్స్ సౌండ్ బార్ బ్లూటూత్, USB, AUX, HDMI (ARC) మరియు optical వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. ఇక సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ Dolby Digital Plus సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది.
ఈ ఆఫర్ మరియు సౌండ్ బార్ గురించి చెప్పాలంటే, ఈఆఫర్ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ సౌండ్ బార్ గొప్ప డీల్ అవుతుంది.