flipkart offers big discount offer on LG Dolby Atmos before BBD sale
Flipkart BBD Sale కంటే మూడు రోజుల ముందే LG Dolby Atmos సౌండ్ బార్ పై బిగ్ డీల్ అందించింది. AI Sound Pro మరియు డాల్బీ అట్మాస్ వంటి టాప్ ఫీచర్స్ కలిగిన LG లేటెస్ట్ సౌండ్ బార్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన ఆఫర్స్ తో మంచి డిస్కౌంట్ ధరలో అందుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ మొదలవడానికి ఇంకా నాలుగు రోజులు ఉండగా ఫ్లిప్ కార్ట్ ముందే బ్యాంక్ ఆఫర్స్ ఓపెన్ చేసింది. అందుకే చాలా ప్రొడక్ట్స్ మంచి డిస్కౌంట్ ప్రైస్ తో లభిస్తున్నాయి.
ఎల్‌జి S77TY సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ ఈ డీల్స్ అందించింది.ఈ సౌండ్ బార్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ 44% భారీ డిస్కౌంట్ అందించి రూ. 24,990 ధరతో ఈరోజు లిస్ట్ చేసింది. బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి అందించనున్న 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని ఈరోజు ఈ సౌండ్ బార్ పై అందించింది. అంటే, Axis, ICICI మరియు HDFC బ్యాంక్ కార్డ్స్ తో ఈ సౌండ్ బార్ కొనుగోలు చేసే వారికి రూ. 1,750 రూపాయల అదనపు డిస్కౌంట్ అందిస్తుంది.
ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఎల్‌జి S77TY సౌండ్ బార్ ఈరోజు కేవలం రూ. 23,240 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన సెటప్ మరియు ఫీచర్ వివరాలు క్రింద చూడవచ్చు.
Also Read: Apple iPhone 17 సిరీస్ కొత్త ఫోన్స్ సేల్ ఈరోజు నుంచి ప్రారంభమైంది: ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!
ఎల్‌జి S77TY సౌండ్ బార్ 3.1.3 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో ముందు మూడు స్పీకర్లు మరియు పైన మూడు అప్ ఫైరింగ్ స్పీకర్ సెటప్ కలిగిన బార్ తో జతగా పవర్ ఫుల్ సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ ఎల్‌జి S77TY సౌండ్ బార్ టోటల్ 440W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ చాలా ప్రీమియం డిజైన్ మరియు సౌండ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఎల్‌జి S77TY 3.1.1 ఛానల్ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ మరియు dts:X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది కాకుండా ఇందులో AI Sound Pro మరియు WOW Synergy వంటి మరిన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఈ సౌండ్ బార్ సినిమా థియేటర్ వంటి సౌండ్ ని మీ ఇంటికే తీసుకు వస్తుంది. ఈ సౌండ్ బార్ VRR/ALLM పాస్ త్రూ సపోర్ట్, HDMI eArc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.