flipkart offers big deals on Philips Dolby soundbar today
Philips Dolby సౌండ్ బార్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ మంచి డీల్స్ మరియు ఆఫర్లు అందించింది. ఈ సౌండ్ బార్ ఫిలిప్స్ లేటెస్ట్ గా అందించిన డాల్బీ సౌండ్ బార్ మరియు మంచి ఫీచర్స్ తో పాటు 300W జబర్దస్త్ సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన ఆఫర్లు మరియు ఈ సౌండ్ బార్ కంప్లీట్ ఫీచర్లు వివరంగా అందిస్తున్నాము. 6 వేల రూపాయల ధరలో పవర్ ఫుల్ బ్రాండ్ న్యూ సౌండ్ బార్ కోసం చూసే వారు ఈ డీల్ ను పరిశీలించవచ్చు.
ఫిలిప్స్ యొక్క 2.1 ఛానల్ డాల్బీ సౌండ్ బార్ మోడల్ TAB4230/94 పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఈ ఆఫర్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 65% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 6,999 రూపాయల ఆఫర్ ధరలో లిస్ట్ అయ్యింది. ఈ సౌండ్ బార్ ను బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనే వారికి రూ. 700 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 6,299 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.
Also Read: SIM Binding అంటే ఏమిటి? ఇప్పుడు ఇది ఎందుకు ట్రెండ్ అవుతోంది.!
ఈ ఫిలిప్స్ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 300W జబర్దస్త్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ స్లీక్ మరియు జియోమెట్రిక్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఫిలిప్స్ సౌండ్ బార్ రెండు ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ అండ్ డీప్ బాస్ సౌండ్ అందించే 6.5 ఇంచ్ సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ రిచ్ క్లియర్ అండ్ చాలా బాలెన్స్డ్ సౌండ్ అందిస్తుంది.
ఈ ఫిలిప్స్ సౌండ్ బార్ డాల్బీ డిజిటల్ సౌండ్ టెక్నాలజీ సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇందులో అందించిన HDMI Arc, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ తో స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఫోన్, మెమరీ కార్డు మరియు మరిన్ని డివైజెస్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ సౌండ్ బార్ కలిగిన స్పీకర్ సెటప్ మరియు సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది.
ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.2 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.