boAt Party speakers పై ఫ్లిప్ కార్ట్ భారీ డీల్స్ అందుకోండి.!

Updated on 24-Oct-2025
HIGHLIGHTS

boAt Party speakers పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు భారీ డీల్స్ అందించింది

ఈరోజు ఫ్లిప్ కార్ నుంచి పార్టీ స్పీకర్లు మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ అవుతున్నాయి

రెండు స్పీకర్లు మంచి ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి

boAt Party speakers పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు భారీ డీల్స్ అందించింది. పవర్ ఫుల్ సౌండ్ అందించే రెండు పార్టీ స్పీకర్లు ఈరోజు ఫ్లిప్ కార్ నుంచి అముఞ్చి డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ అవుతున్నాయి. ఈ రెండు పార్టీ స్పీకర్లు కూడా మంచి ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా గొప్ప బడ్జెట్ ధరలో ఈరోజు లభిస్తున్నాయి. ఈ రోజు ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ రెండు పార్టీ స్పీకర్ డీల్స్ పై ఒక లుక్కేద్దామా.

boAt Party speakers ఆఫర్

ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి బోట్ పార్టీ పేపాల్ 185 మరియు బోట్ పార్టీ పేపాల్ 390 ప్లే బ్యాక్ రెండు స్పీకర్లు కూడా మంచి ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. ఈ రెండు డీల్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

boAt PartyPal 185

ఈ పార్టీ స్పీకర్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 73% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 4,799 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఈ పార్టీ స్పీకర్ 50W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. ఇందులో పార్టీ యాంబియన్స్ ఫ్లేమ్ LED లైట్స్ మరియు కస్టమైజ్ బాస్ అండ్ ట్రబుల్ ఫీచర్ తో వస్తుంది. ఈ పార్టీ స్పీకర్ బిల్ట్ ఇన్ కరోకే సపోర్ట్, AUX, USB, TF కార్డ్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ స్పీకర్ 6 గంటల ప్లే టైమ్ ఆఫర్ చేస్తుంది.

Also Read: సేల్ చివరి సమయంలో భారీ Samsung 4K Smart Tv ప్రకటించిన ఫ్లిప్ కార్ట్.!

boAt Partypal 390Playback

ఇది పవర్ ఫుల్ సౌండ్ అందించే బోట్ పార్టీ స్పీకర్ మరియు ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 71% భారీ డిస్కౌంట్ తో రూ. 9,999 ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఈ స్పీకర్ ని ఫ్లిప్ కార్ట్ నుంచి SBI క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 999 అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ పార్టీ స్పీకర్ కేవలం రూ. 9,000 ధరలో లభిస్తుంది.

ఇక ఈ పార్టీ స్పీకర్ సౌండ్ మరియు ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ స్పీకర్ టోటల్ 160W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఈ స్పీకర్ హై క్వాలిటీ సౌండ్ అందిస్తుంది మరియు ఫ్లేమ్ LED లైట్స్ తో మంచి పార్టీ సెటప్ అందిస్తుంది. ఈ పార్టీ స్పీకర్ రెండు పవర్ ఫుల్ ఉఫర్స్ కలిగి ఉంటుంది మరియు AUX, USB, TF కార్డ్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ కలిగి ఉంటుంది. ఇది సింగల్ ఛార్జ్ పై 6 గంటల ప్లే బ్యాక్ ఆఫర్ చేస్తుంది. ఇది పార్టీ, పాప్, రాక్ మరియు జాజ్ ఈక్వలైజర్ తో వస్తుంది. ఇది అడుగున వీల్స్ కలిగి ఉంటుంది మరియు TWS మోడ్ తో కూడా వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :