LG 3.1.1 Dolby Atmos సౌండ్ బార్ జూన్ ఎపిక్ సేల్ నుంచి ఆల్ టైం చవక ధరలో లభిస్తోంది.!

HIGHLIGHTS

LG 3.1.1 Dolby Atmos సౌండ్ బార్ జూన్ ఎపిక్ సేల్ నుంచి ఆల్ టైం చవక ధరలో లభిస్తోంది

ఫ్లిప్ కార్ట్ కొత్తగా ఈ సేల్ ను అనౌన్స్ చేసింది మరియు ఈరోజు నుంచి ఈ సేల్ స్టార్ట్ అయ్యింది

డాల్బీ అట్మోస్ మరియు DTS వంటి అన్ని సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది

LG 3.1.1 Dolby Atmos సౌండ్ బార్ జూన్ ఎపిక్ సేల్ నుంచి ఆల్ టైం చవక ధరలో లభిస్తోంది. ఫ్లిప్ కార్ట్ కొత్తగా ఈ సేల్ ను అనౌన్స్ చేసింది మరియు ఈరోజు నుంచి ఈ సేల్ స్టార్ట్ అయ్యింది. ఈ సేల్ లేటెస్ట్ సేల్ నుంచి ఫ్లిప్ కార్ట్ ఈ బిగ్ డీల్ ను అందించింది. ఈ ఎల్ జి సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ మరియు DTS వంటి అన్ని సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

LG 3.1.1 Dolby Atmos సౌండ్ బార్ : ఆఫర్

ఎల్ జి యొక్క S70TY 3.1.1 సౌండ్ బార్ పై ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈ రోజు 40% భారీ డిస్కౌంట్ అందించి రూ. 20,999 ధరతో సేల్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ ఈరోజు కూడా ఎల్ జి అఫీషియల్ సైట్ నుంచి రూ. 22,990 రూపాయల ధరతో సేల్ అవుతోంది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి చవక ధరలో లభిస్తుంది.

కేవలం పైన తెలిపిన డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ పై ఆకర్షణీయమైన బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ సౌండ్ బార్ ని ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి BOB (బ్యాంక్ ఆఫ్ బరోడా) బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 19,749 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.

Also Read: Pm Kisan Yojana: రైతులకు కేంద్రం కీలక అప్‌డేట్ .. అకౌంట్ లో డబ్బులు పడేది ఎప్పుడంటే.!

LG 3.1.1 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఎల్ జి S70TY ఒక ప్రీమియం 3.1.1 ఛానల్ డాల్బీ అట్మోస్ సౌండ్‌ బార్. ఇది థియేటర్ తరహా ఆడియో అనుభూతిని అందిస్తుంది. ఈ సౌండ్ బార్ మొత్తం 400W పవర్ అవుట్‌ పుట్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్‌ బార్‌ లో సెంటర్ అప్ ఫైరింగ్ టెక్నాలజీ ఉండటం వల్ల డైలాగ్‌లు మరింత స్పష్టంగా వినిపిస్తాయి. అలాగే, డాల్బీ అట్మోస్ మరియు DTS : X సపోర్ట్ ద్వారా 3D సరౌండ్ సౌండ్ అనుభూతి కూడా మీకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ తో వచ్చే ప్రత్యేక వైర్‌ లెస్ సబ్‌ వూఫర్ లోతైన బాస్‌ ను అందించడంతో యాక్షన్ సన్నివేశాలు మరియు సంగీతం మరింత ప్రభావవంతంగా ఉంటుంది.

ఈ సౌండ్ బార్ లో ప్రత్యేకంగా WOW Orchestra ఫీచర్‌ ను కూడా ఎల్ జి అందించింది. ఇది అనుకూల LG టీవీ స్పీకర్లు మరియు సౌండ్‌ బార్‌ ను ఒకేసారి పనిచేసేలా చేసి మరింత విస్తృతమైన ఆడియో అనుభూతిని అందిస్తుంది. కనెక్టివిటీ పరంగా, బ్లూటూత్ , HDMI eARC, ఆప్టికల్ మరియు USB సపోర్ట్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఉన్న AI Sound Pro టెక్నాలజీ కంటెంట్‌ ను విశ్లేషించి ఆడియో సెట్టింగ్‌లను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :