flipkart june epic sale best 5.2.4 Dolby Atmos soundbar deal today
కొత్త సౌండ్ బార్ అది కూడా వైర్లెస్ 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ కొనాలని చేసే వారికి గుడ్ న్యూస్. ఫ్లిప్ కార్ట్ జూన్ ఎపిక్ సేల్ నుంచి ఈరోజు మీ కోరికను నెరవేర్చుకోవచ్చు. ఎందుకంటే, ఇండియన్ మార్కెట్లో లేటెస్ట్ గా విడుదలైన వైర్లెస్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ఈరోజు గొప్ప డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈక్వల్ 16 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది.
ZEBRONICS ఇటీవల విడుదల చేసిన 5.2.4 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ Juke BAR 9850 ని ఈరోజు ఫ్లిప్ కార్ట్ గొప్ప డిస్కౌంట్ తో 16 వేల రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తుంది. 75% భారీ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ ని రూ. 18,999 ఆఫర్ ధరలో లిస్ట్ చేసిన ఫ్లిప్ కార్ట్ ఈ సౌండ్ బార్ పై రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 1,250 రూపాయల బ్యాంక్ అఫ్ బరోడా బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా జత చేసింది. ఈ మూడు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 16,749 రూపాయల అతి చవక ధరలో మీకు లభిస్తుంది.
Also Read: Redmi Turbo 5 లాంచ్ కంటే ముందే టాప్ 5 ఫీచర్స్ తెలుసుకోండి.!
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ ప్రీమియం డిజైన్ మరియు సెటప్ తో వస్తుంది. ఇందులో పైన అప్ ఫైరింగ్ మరియు ముందు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్ వస్తుంది. ఈ బార్ తో జతగా డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు డ్యూయల్ సబ్ ఉఫర్ కూడా వస్తాయి. ఈ టోటల్ సెటప్ కూడా ఎటువంటి వైర్ లేకుండా పూర్తి వైర్లెస్ గా ఉంటుంది. అంటే, ఈ సౌండ్ బార్ ను చాలా నీట్ అండ్ క్లీన్ పొజిషన్ లో సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ తో థియేటర్ వంటి సూపర్ సరౌండ్ సౌండ్ మరియు ఒళ్ళు జలదరించే బాస్ సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ తో UHF మైక్రో ఫోన్ కూడా వస్తుంది. ఇది మీ ఇంట్లో ఫంక్షన్ మరియు మీరు సరదాగా పాటలు పాడటానికి కూడా ఉపయోగపడుతుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టికల్, AUX మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.