flipkart GOAT Sale offers good discount on CMF Buds today
ఫ్లిప్ కార్ట్ ఈరోజు GOAT Sale నుంచి CMF Buds పై మంచి డిస్కౌంట్ ఆఫర్లు అందించింది. ఈ సేల్ చివరి రోజుకు చేరుకోవడంతో ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ నుంచి అందించే డీల్స్ మరింత విస్తరించింది. CMF ఇటీవల విడుదల చేసిన కొత్త బడ్స్ మొదలుకొని గత సంవత్సరం విడుదల చేసిన ప్రీమియం బడ్స్ సైతం మంచి డిస్కౌంట్ తో ఈరోజు సేల్ నుంచి ఆఫర్ చేస్తోంది.
CMF ఇండియాలో విడుదల చేసిన TWS బడ్స్ అన్నింటిపై పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్లు అందించింది. ఈ సేల్ నుంచి బడ్స్, బడ్స్ 2a, బడ్స్ ప్రో మరియు బడ్స్ ప్రో 2 బడ్స్ పై గొప్ప డిస్కౌంట్ అందించింది.
ఈ సేల్ నుంచి సిఎంఎఫ్ బడ్స్ 400 రూపాయల డిస్కౌంట్ తో ఈరోజు రూ. 1799 రూపాయల ధరలో లభిస్తుంది. ఈ బడ్స్ 42 dB ANC మరియు నథింగ్ యాప్ సపోర్ట్ తో ఆకట్టుకుంటుంది. అలాగే, నథింగ్ బడ్స్ ప్రో కూడా ఈరోజు మంచి డిస్కౌంట్ తో కేవలం రూ. 2,499 ధరలో లభిస్తుంది. ఈ బడ్స్ 39 గంటల బ్యాటరీ లైఫ్, 45 dB ANC మరియు అల్ట్రా బాస్ టెక్నాలజీతో ఆకట్టుకుంటుంది.
సిఎంఎఫ్ లేటెస్ట్ గా విడుదల చేసిన బడ్స్ 2a కూడా ఈరోజు మంచి డిస్కౌంట్ తో కేవలం
రూ. 1,999 ఆఫర్ రేటుకు లభిస్తోంది. ఈ బడ్స్ 42 dB ANC, Dirac ట్యూన్డ్ 12.4mm స్పీకర్లు, అల్ట్రా బాస్ టెక్ మరియు 35.5 బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Also Read: Apple iPhone 16 పై రూ. 15,000 భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించిన ఫ్లిప్ కార్ట్ GOAT Sale
ఇక మెయిన్ బడ్స్ ఆఫర్ విషయానికి వస్తే, ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈ బడ్స్ ను మంచి డిస్కౌంట్ ధరలో అందుకోవచ్చు. సేల్ ముందు రూ. 4,299 ప్రైస్ ట్యాగ్ తో అమ్ముడైన ఈ బడ్స్ ఈరోజు రూ. 800 డిస్కౌంట్ తో కేవలం రూ. 3,499 ధరలో లభిస్తున్నాయి. ఈ బడ్స్ 50 dB స్మార్ట్ ANC సపోర్ట్, LDAC మరియు Hi-Res ఆడియో వైర్లెస్ సపోర్ట్ తో ఆకట్టుకునే సౌండ్ అందిస్తుంది. ఈ బడ్స్ Dirac Opteo తో స్పెషల్ ఆడియో అందిస్తుంది మరియు 6 HD మైక్స్ తో గొప్ప కాలింగ్ కూడా ఆఫర్ చేస్తుంది. ఈ బడ్స్ టోటల్ 43 గంటల ప్లే టైం కలిగి ఉంటుంది.