కేవలం 8 వేల బడ్జెట్ ధరలో 5.1 Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి .. చివరి రోజు ఆఫర్.!
ఫ్లిప్ కార్ట్ కొత్తగా ప్రకటించిన బ్లాక్ ఫ్రైడే సేల్ ఈ రోజు అర్ధరాత్రి తో ముగుస్తుంది
ఈ సేల్ నుంచి అనేక ప్రొడక్ట్స్ పై అద్భుతమైన ఆఫర్లను అందించింది
కేవలం 8 వేల బడ్జెట్ ధరలో లభిస్తున్న లేటెస్ట్ 5.1 Dolby Atmos సౌండ్ బార్ డీల్
ఫ్లిప్ కార్ట్ కొత్తగా ప్రకటించిన బ్లాక్ ఫ్రైడే సేల్ ఈ రోజు అర్ధరాత్రి తో ముగుస్తుంది. గత నాలుగు రోజులుగా అందుబాటులో ఉన్న ఈ సేల్ నుంచి అనేక ప్రొడక్ట్స్ పై అద్భుతమైన ఆఫర్లను అందించింది. అయితే, ఈ సేల్ ఈ రోజు చివరి రోజుకు చేరుకుంది. అందుకే, కాబోలు ఈరోజు చాలా ప్రొడక్ట్స్ పైన మరింత గొప్ప ఆఫర్లు ప్రకటించింది. ముఖ్యంగా, సౌండ్ బార్ డీల్స్ కోసం చూస్తున్న వారికి ఈ రోజు గొప్ప డీల్స్ ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్ తో కేవలం 8 వేల బడ్జెట్ ధరలో లభిస్తున్న లేటెస్ట్ 5.1 Dolby Atmos సౌండ్ బార్ డీల్ వివరాలు ఈరోజు అందిస్తున్నాము.
5.1 Dolby Atmos సౌండ్ బార్ డీల్
MOTOROLA ఇండియాలో 5.1 ఛానల్ సెటప్ తో విడుదల చేసిన డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ AmphisoundX Vibe ఈరోజు ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి ఈ బడ్జెట్ ప్రైస్ లో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈ రోజు 80 శాతం భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 9,999 రూపాయల ఆఫర్ ధరలో లిస్ట్ అయ్యింది. ఈ సౌండ్ బార్ లాంచ్ అయిన తర్వాత ఇది అత్యల్ప ధరగా నమోదయ్యింది.
ఈ సౌండ్ బార్ పైన అందించిన డిస్కౌంట్ కాకుండా రూ. 500 రూపాయల కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 760 రూపాయల ICICI క్రెడిట్ కార్డ్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి ఈరోజు కేవలం రూ. 8,739 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది.
Also Read: iQOO 16 ఇండియా లాంచ్ అండ్ కీలక ఫీచర్స్ అనౌన్స్ చేసిన ఐకూ .. ఫాస్ట్ చిప్ సెట్ తో వస్తోంది.!
MOTOROLA 5.1 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ మోటోరోలా సౌండ్ బార్ స్లీక్ మరియు సుందరమైన డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 600W జబర్దస్త్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో 6 ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్, డ్యూయల్ రియర్ శాటిలైట్ స్పీకర్ మరియు మంచి బేస్ అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. ఇది మంచి సరౌండ్ సెటప్ కలిగి ఉంటుంది.
ఇక సౌండ్ టెక్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ మోటోరోలా సౌండ్ బార్ కలిగిన స్పీకర్ సెటప్ మరియు సౌండ్ టెక్నాలజీ తో సినిమా థియేటర్ వంటి మంచి సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ సపోర్ట్, ఆప్టికల్ ఇన్పుట్ సపోర్ట్ మరియు HDMI eArc సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.