లేటెస్ట్ 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!

HIGHLIGHTS

లేటెస్ట్ 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి

ఫ్లిప్ కార్ట్ బిగ్ డిస్కౌంట్ ఆఫర్స్ తో మొదటిసారి అతి చవక ధరలో సేల్ అవుతోంది

ఈ సౌండ్ బార్ 5.1.2 డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ కలిగి ఉంటుంది

ఫ్లిప్ కార్ట్ ఈరోజు లేటెస్ట్ 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ అనౌన్స్ చేసింది. ఈ సౌండ్ బార్ ఇటివలే ఇండియన్ ,మార్కెట్లో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ డిస్కౌంట్ ఆఫర్స్ తో మొదటిసారి 16 వేల రూపాయల అతి చవక ధరలో సేల్ అవుతోంది. అందుకే, ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ ను ప్రత్యేకంగా మీ ముందుకు తీసుకొచ్చాము.

ఏమిటి 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ డీల్?

ప్రముఖ ఇండియన్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ Portronics లేటెస్ట్ గా విడుదల చేసిన 5.1.2 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ Slick X1 పై ఫ్లిప్ కార్ట్ ఈ డీల్స్ అందించింది. పోర్ట్రోనిక్స్ ఈ సౌండ్ బార్ ను రూ. 20,999 రూపాయల ధరతో లాంచ్ చేయగా, ఫ్లిప్ కార్ట్ ఈరోజు రూ. 2,000 డిస్కౌంట్ అందించి రూ. 18,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది.

ఈ సౌండ్ బార్ పై అందించిన డిస్కౌంట్ ఆఫర్ కాకుండా రూ. 2,000 రూపాయల అదనపు కూపన్ డిస్కౌంట్ ఆఫర్ కూడా జత చేసింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 16,999 రూపాయల బడ్జెట్ ధరలో ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి అందుకోవచ్చు.

Also Read: Realme Narzo Series నుంచి అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ అనౌన్స్ చేసిన రియల్ మీ.!

Portronics 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ సౌండ్ బార్ చాలా ప్రీమియం డిజైన్ తో ఆకట్టుకుంటుంది మరియు 5.1.2 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో ముందు ఐదు స్పీకర్లు మరియు పైన రెండు స్పీకర్లు కలిగిన లాంగ్ బార్, వైర్లెస్ శాటిలైట్ స్పీకర్ మరియు పవర్ ఫుల్ డౌన్ ఫైరింగ్ స్పీకర్ కలిగిన సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ కలిగిన కంప్లీట్ స్పీకర్ సెటప్ తో టోటల్ 600W జబర్దస్త్ అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది.

ఈ సౌండ్ బార్ 5.1.2 డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. అంటే, ఇది సినిమా థియేటర్ వంటి ఆల్ సరౌండ్ సౌండ్ అందించే ఫీచర్ అండ్ సెటప్ కలిగి ఉంటుంది. ఇది ఇంటిని షేక్ చేసే జబర్దస్త్ డీప్ బాస్ సౌండ్ అందిస్తుందని పోర్ట్రోనిక్స్ తెలిపింది. ఈ సౌండ్ బార్ లో బిల్ట్ ఇన్ DSP చిప్ తో కూడా వస్తుంది. ఇందులో HDMI Arc, USB, ఆప్టికల్ ఇన్, AUX మరియు బ్లూటూత్ వెర్షన్ 5.3 మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :