CMF Buds available at lowest price ever from Flipkart Sale 2025
Flipkart Sale 2025 ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ మరియు డీల్స్ తో ప్లస్ యూజర్ల కోసం ప్రారంభమయ్యింది. ఈ సేల్ నుంచి ఈరోజు CMF Buds ఆల్ టైమ్ తక్కువ ధరలో లభిస్తున్నాయి. నథింగ్ సబ్ బ్రాండ్ సిఎంఎఫ్ అందించిన బడ్స్ 2a, బడ్స్ 2 ప్లస్ మరియు బడ్స్ ప్రో 2 ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి చవక ధరలో లభిస్తున్నాయి. ఈ బడ్స్ మంచి సౌండ్ అందిస్తాయి మరియు మంచి ANC సపోర్ట్ కూడా కలిగి ఉంటాయి. కొత్త బడ్స్ కొనాలని చూస్తుంటే, ఈరోజు లభిస్తున్న ఈ డీల్స్ పరిశీలించవచ్చు.
పైన తెలిపిన విధంగా ఈరోజు ఫ్లిప్ కార్ట్ బడ్స్ 2a, బడ్స్ 2 ప్లస్ మరియు బడ్స్ ప్రో 2 ఇయర్ బడ్స్ పై ఈ డీల్స్ అందించింది. ఈ ఇయర్ బడ్స్ ఆఫర్ ధర మరియు ఫీచర్స్ ఇక్కడ చూడవచ్చు.
రూ. 2,299 ప్రైస్ తో వచ్చిన ఈ ఇయర్ బడ్స్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి కేవలం రూ. 1,699 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తున్నాయి. ఈ బడ్స్ 12.4mm స్పీకర్, 42 dB ANC సపోర్ట్ తో వస్తుంది. ఈ బడ్స్ అల్ట్రా బాస్ టెక్, Dirac సౌండ్ ట్యూన్డ్ స్పీకర్లతో వస్తుంది మరియు 35.5 గంటల ప్లే టైమ్ ఆఫర్ చేస్తుంది.
ఈ ఇయర్ బడ్స్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి కేవలం రూ. 2,599 ధరకే లభిస్తున్నాయి. ఈ బడ్స్ 6HD Mic సపోర్ట్ తో గొప్ప కాలింగ్ సౌకర్యం అందిస్తుంది మరియు 61.5 గంటల ప్లే టైమ్ అందిస్తుంది. ఇది కాకుండా ఈ బడ్స్ Hi-Res ఆడియో, LDAC సపోర్ట్, స్పేషియల్ ఆడియో ఫీచర్ మరియు 50dB హైబ్రిడ్ ANC సపోర్ట్ తో వస్తుంది.
Also Read: Flipkart BBD Sale బిగ్ డిస్కౌంట్ తో POCO X7 Pro చవక ధరలో లభిస్తోంది.!
ఈ నథింగ్ ఇయర్ బడ్స్ మంచి సౌండ్ అందిస్తుంది. ఇది ఇండియాలో రూ. 4,799 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి కేవలం రూ. 3,199 ఆఫర్ ధరతో సేల్ అవుతోంది. ఈ ఇయర్ బడ్స్ 11mm బాస్ డ్రైవర్ మరియు 6mm ట్వీటర్ కలిగిన డ్యూయల్ డ్రైవర్ తో వస్తుంది. ఇది Dirac Opteo మరియు LDAC సపోర్ట్ కలిగిన Hi-Res ఆడియో వైర్లెస్ సర్టిఫికేషన్ తో వస్తుంది. 50 dB స్మార్ట్ ANC తో మంచి నోయిస్ క్యాన్సిలేషన్ మరియు 6 HD మైక్ తో గొప్ప కాలింగ్ కూడా ఆఫర్ చేస్తుంది.