boAt 5.2.4 Dolby Atmos today available at lowest price ever from amazon sale
ప్రముఖ భారతీయ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ బోట్ యొక్క లేటెస్ట్ boAt 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదల అయింది మరియు ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఆఫర్ ధరకు లభిస్తుంది. ఎందుకంటే, అమెజాన్ ఈ సౌండ్ బార్ పై ఈరోజు డిస్కౌంట్ మరియు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది.
బోట్ యొక్క ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి 75% భారీ డిస్కౌంట్ అందుకుని కేవలం రూ . 18,999 ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ని SBI బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 17,499 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. Buy From Here
Also Read: భారీ డిస్కౌంట్ తో కేవలం 43 ఇంచ్ టీవీ రేటుకే లభిస్తున్న 55 ఇంచ్ QLED Smart TV
బోట్ యొక్క ఈ లేటెస్ట్ సౌండ్ బార్ 5.2.4 సరౌండ్ సౌండ్ సెటప్ కలిగి ఉంటుంది. అంటే, ఇందులో ముందు మూడు మరియు పైన రెండు సరౌండ్ స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు మరియు డ్యూయల్ వైర్లెస్ సబ్ ఉఫర్ సెటప్ ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఎటువంటి వైర్లు బెడద లేని వైర్లెస్ సెటప్ తో ఉంటుంది. ఈ ఫీచర్ తో ఈ సౌండ్ బార్ ను అందంగా సెటప్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇక ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఇందులో డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ ను బోట్ అందించింది. ఇది కలిగిన కంప్లీట్ స్పీకర్ సెటప్ తో టోటల్ 625W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఇది పూర్తి సరౌండ్ మరియు పవర్ ఫుల్ బాస్ సౌండ్ తో సినిమా థియేటర్ వంటి గొప్ప సౌండ్ మీకు ఆఫర్ చేస్తుంది. ఇందులో HDMI (eARC), USB, AUX, Coaxial, ఆప్టికల్ మరియు బ్లూటూత్ 5.1 వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.