boAt 5.1 Dolby Soundbar available at lowest price today
boAt 5.1 Dolby Soundbar ఈరోజు మంచి ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు మంచి డిస్కౌంట్ తో సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ సౌండ్ బార్ రీసెంట్ గా మార్కెట్లో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు రీజనబుల్ బడ్జెట్ ధరలో లభిస్తుంది. 9 వేల రూపాయల బడ్జెట్ ధరలో 5.1 ఛానల్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ కోసం చూస్తుంటే, ఈరోజు లభిస్తున్న ఈ డీల్ ను పరిశీలించవచ్చు.
ప్రముఖ భారతీయ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ బ్రాండ్ బోట్ యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ Aavante Prime 5.1 5000D ఈరోజు ఈ బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ మార్కెట్లో రూ. 11,999 రూపాయల ధరలో లాంచ్ అవ్వగా, ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి రూ. 2,000 డిస్కౌంట్ అందుకుని కేవలం రూ. 9,999 రూపాయల ప్రైస్ తో సేల్ అవుతోంది.
ఇది మాత్రమే కాదు, ఈ సౌండ్ బార్ పై మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అమెజాన్ అందించింది. ఈ సౌండ్ బార్ ని ఈరోజు అమెజాన్ నుంచి Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 999 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 9,000 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here
Also Read: Apple Event 2025: ఐఫోన్ 17 సిరీస్ తో పాటు మరిన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేయవచ్చని అంచనా వేస్తున్నారు.!
ఈ బోట్ సౌండ్ బార్ ప్రీమియం డిజైన్ తో ఆకట్టుకుంటుంది మరియు 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో ముందు 6 స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు మరియు వైర్లెస్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 500W సౌండ్ అవుట్ పుట్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇది మాస్టర్ రిమోట్, ఈక్వలైజర్ మరియు బార్ లో మాన్యువల్ కంట్రోల్స్ కూడా కలిగి ఉంటుంది.
ఈ బోట్ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఇందులో AUX, USB, ఆప్టికల్, HDMI (eARC) మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కూడా ఉంటాయి. ఈ సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి 4.2 స్టార్ రేటింగ్ అందుకుంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ నుంచి బడ్జెట్ ధరలో లభిస్తుంది.