boAt 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ భారీ డీల్స్ తో కేవలం 10 వేల బడ్జెట్ ధరలో లభిస్తోంది.!
boAt 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు మీకు చాలా చవక ధరలో లభిస్తోంది
ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి ఎన్నడూ చూడని చవక ధరలో లభిస్తుంది
తక్కువ లో తక్కువ 10 వేల రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది
boAt 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు మీకు చాలా చవక ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి ఎన్నడూ చూడని చవక ధరలో లభిస్తుంది. లాంచ్ ధరతో పోలిస్తే ఈ సౌండ్ బార్ ఈరోజు మీకు తక్కువ లో తక్కువ 10 వేల రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఆఫర్ చేస్తున్న ఈ జబర్దస్త్ సౌండ్ బార్ డీల్ పై ఒక లుక్కేద్దాం పదండి.
SurveyboAt 5.1.2 Dolby Atmos సౌండ్ బార్: డీల్
బోట్ ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన సౌండ్ బార్ Aavante Prime 5.1.2 5050DA పై ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 16,999 రూపాయల ధరతో విడుదల అయ్యింది మరియు ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 5,000 భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 11,999 ఆఫర్ ధరలో సేల్ అవుతోంది.

ఈ సౌండ్ బార్ పై 10% భారీ అదనపు బ్యాంక్ ఆఫర్ కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ సౌండ్ బార్ ని Federal, BOB CARD EMI, PNB, HDFC మరియు HSBC బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు ఛీ వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ మీకు కేవలం రూ. 10,800 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది. ఇది ఈ సౌండ్ బార్ లాంచ్ తర్వాత లభించే అతి చవక ధర అవుతుంది.
Also Read: Truecaller Voicemail: ఆండ్రాయిడ్ యూజర్లకు ఉచితంగా AI ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్ వచ్చేసింది.!
boAt 5.1.2 Dolby Atmos సౌండ్ బార్: ఫీచర్స్
ఈ బోట్ సౌండ్ బార్ 5.1.2 సౌండ్ సెటప్ కలిగి ఉంటుంది. అంటే, ఈ సౌండ్ బార్ సెటప్ లో ముందు 6 స్పీకర్లు మరియు పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్ ఉంటుంది. ఈ బార్ తో పాటు డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ కూడా ఉంటాయి. ఈ సౌండ్ బార్ పూర్తి సరౌండ్ సెటప్ తో ఉండటమే కాకుండా 550W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది.
ఈ బోట్ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన 5.1.2 సెటప్ మరియు భారీ సౌండ్ అవుట్ పుట్ తో ఈ సౌండ్ బార్ సినిమా థియేటర్ వంటి సౌండ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇందులో HDMI e Arc, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి.