best earbuds for calling and music under rs 2000 in india
అండర్ రూ. 2,000 కాలింగ్ మరియు మ్యూజిక్ కోసం బెస్ట్ Earbuds కోసం చూస్తున్నారా? అయితే, ఈరోజు మీకు సహాయం చేస్తాము. ఇండియన్ మార్కెట్ లో లేటెస్ట్ గా విడుదలైన ఇయర్ బడ్స్ లో రూ. 2,000 రూపాయల కంటే తక్కువ ధరలో మంచి ఫీచర్స్ కలిగి డబ్బుకు తగిన విలువ అందించే బెస్ట్ ఇయర్ బడ్స్ ఈరోజు అందిస్తున్నాము.
ఇండియన్ మార్కెట్లో చాలా వేగంగా ఇయర్ బడ్స్ లాంచ్ అవుతున్నాయి. వీటిలో చాలా ఇయర్ బడ్స్ గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటాయి. అయితే, యూజర్ కి తగిన మంచి అనుభూతిని అందించే బడ్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి. సాధారణంగా అన్ని ఇయర్ బడ్స్ కూడా ఎంతో కొంత మంచి సౌండ్ ని ఆఫర్ చేస్తున్నాయి. అయితే, క్లియర్ కాలింగ్ మరియు క్లియర్ సౌండ్ అందించే బడ్స్ కొన్ని మాత్రమే ఉంటాయి. వాటిలో మూడు బెస్ట్ ఇయర్ బడ్స్ ఈరోజు చూద్దాం.
ప్రైస్ : రూ. 1,549 (Buy From Here)
ఈ ఇయర్ బడ్స్ ను వన్ ప్లస్ రీసెంట్ గా లాంచ్ చేసింది. ఈ బడ్స్ ANC ఫీచర్ కలిగి ఉండకపోయినా మంచి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో మీరు ప్రీమియం సౌండ్ ఆస్వాదించవచ్చు. ఇది 12.4mm టైటానైజ్డ్ స్పీకర్స్ తో వస్తుంది మరియు 3D స్పేషియల్ ఆడియోతో ఆకట్టుకునే సౌండ్ అందిస్తుంది. ఈ బడ్స్ గొప్ప క్లియర్ కాలింగ్ అందిస్తాయి. ఇది మొత్తం నాలుగు మైక్స్ కలిగి AI నోయిస్ క్యాన్సిలేషన్ తో గొప్ప కాలింగ్ ఆఫర్ చేస్తుంది. బ్యాలెన్స్ సౌండ్ మరియు గొప్ప కాలింగ్ కోరుకునే వారు ఈ బడ్స్ ఎంచుకోవచ్చు.
ప్రైస్ : రూ. 1,799 (Buy From Here)
ప్రముఖ ఇండియన్ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ బోట్ అందించిన బడ్స్ ఇవి. ఈ బడ్స్ ని Dolby Audio సపోర్ట్ తో అందించింది. ఈ బడ్స్ 10mm టైటానియం స్పీకర్లు కలిగి డాల్బీ ఆడియో తో గొప్ప సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇందులో క్లియర్ వాయిస్ కాల్స్ కోసం క్వాడ్ మైక్స్ AI-ENx టెక్నాలజీ వుంది. ఇది మంచి క్లియర్ కాలింగ్ అందిస్తుంది. ఇది గేమింగ్ కోసం 50ms బెస్ట్ మోడ్ కలిగి ఉంటుంది. ఓవరాల్ గా ఇది మ్యూజిక్ మరియు OTT కంటెంట్ కోసం తగిన ఆప్షన్ అవుతుంది.
Also Read: Lava Agni 4 లాంచ్ కంటే ముందే కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకోండి.!
ప్రైస్ : రూ. 1,799 (Buy From Here)
రియల్ మీ అందించిన ఈ బడ్స్ కూడా రూ. 2,000 రూపాయల బడ్జెట్ ప్రైస్ లో చూడదగిన మంచి ఆప్షన్ అవుతుంది. ఈ బడ్స్ 12.4mm డైనమిక్ బాస్ స్పీకర్ కలిగి ఉంటుంది మరియు LADC Hi-Res Audio సపోర్ట్ తో వస్తుంది. ఇది గొప్ప లీనమయ్యే సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ బడ్స్ బడ్జెట్ ధరలో 32 dB ANC సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ బడ్స్ కూడా క్వాడ్ మైక్ AI కాల్ నోయిస్ క్యాన్సిలేషన్ కలిగి ఉంటుంది మరియు 3D స్పేషియల్ సౌండ్ ఫీచర్ కలిగి ఉంటుంది.