బిగ్ డీల్స్ తో 8 వేలకే లభిస్తున్న Dolby Atmos సౌండ్ బార్.!

Updated on 15-Feb-2025
HIGHLIGHTS

ప్రస్తుతం మార్కెట్లో మంచి ఆఫర్ ధరకే సౌండ్ బార్ లు లభిస్తున్నాయి

బడ్జెట్ Dolby Atmos సౌండ్ బార్ డీల్ ఈరోజు అందుబాటులో వుంది

ఈ సౌండ్ బార్ మరింత చవక ధరకు లభిస్తుంది

గతంలో Dolby Atmos సౌండ్ టెక్నాలాజి హెడ్ ఫోన్ కొనాలంటేనే చాలా ఖర్చు చేయవలసి వచ్చేది. ఇక సౌండ్ బార్ కొనాలంటే, 50 వేలకు పైగానే ఖర్చు చేయాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు కాలం మారింది. ప్రస్తుతం మార్కెట్లో మంచి ఆఫర్ ధరకే సౌండ్ బార్ లు లభిస్తున్నాయి. ఈరోజు అటువంటి ఒక బెస్ట్ బడ్జెట్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ గురించి చూడనున్నాము.

బడ్జెట్ Dolby Atmos సౌండ్ బార్:

ఈరోజు GOVO యొక్క డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ GOSURROUND 940 మంచి ఆఫర్స్ తో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ 10 వేల బడ్జెట్ సెగ్మెంట్ లో లభించే ఏకైక 2.1.2 ఛానల్ సౌండ్ బార్ గా నిలుస్తుంది. ఈ GOVO ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 2,000 రూపాయల డిస్కౌంట్ తో కేవలం రూ. 8,999 రూపాయల ఆఫర్ ధరకు అందుబాటులో ఉంది.

ఈ బడ్జెట్ సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ అందించిన బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ మరింత చవక ధరకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ని HDFC, BOBCARD మరియు IDFC FIRST బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10%, అంటే రూ. 899 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 8,100 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది.

Also Read: చవక ధరల్లో 24bit స్పెటియల్ సౌండ్ తో కొత్త Buds ECHO ఇయర్ బడ్స్ లాంచ్.!

GOVO Dolby Atmos Soundbar: ఫీచర్స్

గోవో యొక్క ఈ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ 2.1.2 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో 2 ఫ్రంట్ ఫైరింగ్ మరియు రేణు అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 400W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది.

ఈ గోవో సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ బ్లూటూత్ 5.3, ఆప్టికల్, HDMI Arc, USB మరియు AUX కనెక్టివిటీ ఆప్షన్ లను కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :