గొప్ప డిస్కౌంట్ తో అండర్ రూ. 10,000 ధరలో లభించే టాప్ Dolby Atmos సౌండ్ బార్ డీల్స్.!

HIGHLIGHTS

గొప్ప డిస్కౌంట్ తో అండర్ రూ. 10,000 ధరలో లభించే టాప్ Dolby Atmos సౌండ్ బార్ డీల్స్

చాలా తక్కువ ధరలోనే మంచి ఫీచర్స్ కలిగిన డాల్బీ సౌండ్ బార్ లు లభిస్తున్నాయి

ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి మంచి డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి

గొప్ప డిస్కౌంట్ తో అండర్ రూ. 10,000 ధరలో లభించే టాప్ Dolby Atmos సౌండ్ బార్ డీల్స్ ఈరోజు చూడనున్నారు. గతంలో ఒక డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ కొనుగోలు చేయాలంటే కనీసం రూ. 20,000 రూపాయలైనా ఖర్చు చేయాల్సి వచ్చేది. అయితే, పెరిగిన టెక్నాలజీ మరియు మార్కెట్లో పెరిగిన కాంపిటీషన్ కారణంగా ఇప్పుడు చాలా తక్కువ ధరలోనే మంచి ఫీచర్స్ కలిగిన డాల్బీ సౌండ్ బార్ లు లభిస్తున్నాయి. వాటిలో మంచి డిస్కౌంట్ తో 10 వేల కంటే తక్కువ ధరలో లభించే బెస్ట్ డీల్స్ ఈ రోజు చూద్దాం.

Dolby Atmos సౌండ్ బార్ డీల్స్

ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి మంచి డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అందులోనూ పదివేల రూపాయల కంటే తక్కువ ధరలో రెండు బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ఈరోజు లభిస్తున్నాయి. ఈ రెండు డీల్స్ పూర్తి వివరాలు చూద్దాం.

ZEBRONICS Juke Bar 9600

ఇది జెబ్రోనిక్స్ అందించిన బడ్జెట్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్. ఇది 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు మంచి ఫీచర్స్ కలిగి ఉంది. ఇందులో నాలుగు స్పీకర్లు కలిగిన బార్ మరియు గొప్ప బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ ఉన్నాయి. ఈ సౌండ్ బార్ డీసెంట్ డాల్బీ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇందులో HDMI Arc, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఇందులో ఉన్న వర్చువల్ 5.1 ఫీచర్ తో మరింత లీనమయ్యే సౌండ్ అందిస్తుంది.

ఈ సౌండ్ బార్ రీసెంట్ గా కూడా రూ. 8,999 ధరలో ప్రైస్ తో సేల్ అయ్యేది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన రూ. 1,000 రూపాయల డిస్కౌంట్ తో కేవలం రూ. 7,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ప్రైస్ లో సబ్ ఉఫర్ తో లభించే ఏకైక బడ్జెట్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ డీల్ గా ఇది నిలుస్తుంది.

Also Read: లేటెస్ట్ 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!

boAt Aavante Bar 4100DA

ఇది ప్రముఖ భారతీయ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ బోట్ అందించిన డాల్బీ అట్మోస్ సౌండ్ బార్. ఈ సౌండ్ బార్ 3.1.2 ఛానల్ సెటప్ తో వస్తుంది. అంటే, ఇందులో ముందు ఉండే స్పీకర్ సెటప్ తో పాటు అప్ ఫైరింగ్ స్పీకర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ ఆరు స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 300W సౌండ్ అందిస్తుంది.

ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 14,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ రోజు ఈ సౌండ్ బార్ పై రూ. 5,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 9,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :