best Dolby 5.2 Soundbar Deal under 12k in India
Soundbar Deal: మీ స్మార్ట్ టీవీకి తగిన బెస్ట్ సౌండ్ బార్ గురించి సెర్చ్ చేస్తుంటే, ఈరోజు మేము మీకు సహాయం చేయనున్నాము. మీ టివికి తగిన బెస్ట్ సౌండ్ బార్ గురించి మీకు వివరాలు అందిస్తున్నాను. స్పెక్స్ షీట్ మరియు యూజర్ రివ్యూల ఆధారంగా ఈ బేస్డ్ డీల్ ను అందిస్తున్నాము. ఈ సౌండ్ బార్ కేవలం 12 వేల రూపాయల బడ్జెట్ ధరలో 660W సౌండ్ అవుట్ పుట్ అందించడమే కాకుండా డ్యూయల్ సబ్ ఉఫర్ మరియు Dolby 5.2 సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని వివరాలు ఇక్కడ అందిస్తున్నాము.
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో బడ్జెట్ ధరలో సౌండ్ బార్ లను అందిస్తున్న కంపెనీగా పేరొందిన GOVO అందించిన లేటెస్ట్ సౌండ్ బార్ ఈ బడ్జెట్ లో బెస్ట్ సౌండ్ బార్ గా నిలుస్తుంది. అదేమిటంటే, GOVO GOSURROUND 999 సౌండ్ బార్. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 12,999 ధరకే లిస్ట్ అయ్యింది. బ్యాంక్ ఆఫర్స్ ద్వారా ఈ సౌండ్ బార్ పై రూ. 1,000 అదనపు డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు. టోటల్ గా ఈ సౌండ్ బార్ ను 12 వేల కంటే తక్కువ ధరకే అందుకోవచ్చు. Check Offers Here
ఇప్పటి వరకు ధర మరియు ఆఫర్స్ గురించి మాట్లాడుకున్నాము. ఈ ధరలో ఈ సౌండ్ బార్ అందించే ఫీచర్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఈ సౌండ్ బార్ 5.2 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. అంటే, ఈ సౌండ్ బార్ లో మూడు స్పీకర్లు కలిగిన బార్, రెండు సబ్ ఉఫర్లు మరియు రెండు శాటిలైట్ స్పీకర్లు ఉంటాయి. ఈ సౌండ్ బార్ ఈ టోటల్ 660W గ్రౌండ్ షేకింగ్ సౌండ్ అందిస్తుంది. అయితే, ఈ సౌండ్ బార్ వైర్లతో కనెక్ట్ చేసేలా ఉంటుంది.
ఇక ఈ సౌండ్ బార్ సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ గోవో సౌండ్ బార్ Hi Res Audio సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ సౌండ్ బార్ లో Aux, ఆప్టికల్, HDMI Arc మరియు బ్లూటూత్ వెర్షన్ 5.3 తో సహా మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ ఉంటుంది. ఈ సౌండ్ బార్ రిమోట్ కంట్రోల్ తో పాటు ఇంటిగ్రేటెడ్ కంట్రోల్స్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ తో 22 వేలకే లభిస్తున్న 50 ఇంచ్ Smart Tv
ఇక ఈ సౌండ్ బార్ రివ్యూలు మరియు రేటింగ్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ ను కొనుగోలు చేసిన అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ కస్టమర్లు ఈ సౌండ్ బార్ కి మంచి రేటింగ్ ఇచ్చారు. ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.4 రేటింగ్ మరియు అమెజాన్ యూజర్ల నుంచి 4.2 రేటింగ్ అందుకుంది. సౌండ్ పరంగా గొప్ప ఇంటిని’షేక్ చేసే BASS మరియు లీనమయ్యే Dolby సరౌండ్ సౌండ్ అందిస్తుందని ఈ సౌండ్ బార్ గురించి యూజర్లు చెబుతున్నారు.