4 వేల బడ్జెట్ లో Dolby Soundbar కోసం చూస్తున్నారా.!

Updated on 28-Jan-2025
HIGHLIGHTS

ఈరోజు మీ కోసం ఒక బడ్జెట్ డాల్బీ సౌండ్ బార్ డీల్ అందుబాటులో వుంది

Dolby Soundbar ను కేవలం 4 వేల రూపాయల బడ్జెట్ లో అందుకోవచ్చు

ఈ సౌండ్ బార్ ఇటీవలే ఇండియాలో విడుదలయ్యింది

Dolby Soundbar ను కేవలం 4 వేల రూపాయల బడ్జెట్ లో కొనాలని చూస్తున్నారా? అయితే, మీ కోసమే ఈ శుభవార్త. ఈరోజు మీ కోసం ఒక బడ్జెట్ డాల్బీ సౌండ్ బార్ డీల్ అందుబాటులో వుంది. ఈ డీల్ Flipkart నుంచి లభిస్తుంది మరియు ఈ సౌండ్ బార్ ఇటీవలే ఇండియాలో విడుదలయ్యింది మరియు ఈరోజు మంచి డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తుంది.

ఏమిటా Dolby Soundbar డీల్?

భారతీయ బ్రాండ్ Egate ఇటీవల విడుదల చేసిన Egate Enigma 315D సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 68% భారీ డిస్కౌంట్ తో రూ. 4,990 ఆఫర్ ధరకు ల లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ని ఫ్లిప్ కార్ట్ నుంచి Canara, HSBC, HDFC మరియు BOBCARD కార్డ్ ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 499 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 4,491 రూపాయల ఆఫర్ ధరకు పొందవచ్చు.

Also Read: Infinix SMART 9 HD: 6 వేల బడ్జెట్ లో పెద్ద స్క్రీన్, బ్యాటరీ మరియు డ్యూయల్ స్పీకర్లతో వచ్చింది.!

Egate Enigma 315D Dolby Soundbar : ఫీచర్స్

ఈ Egate డాల్బీ సౌండ్ బార్ టోటల్ 300 W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ ఉంటాయి.

ఈ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, 3 EQ మోడ్స్ మరియు 300W పవర్ ఫుల్ సౌండ్ తో వస్తుంది. ఈ Egate సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4 స్టార్ రేటింగ్ అందుకుంది. ఈ సౌండ్ బార్ AUX, USB, HDMI Arc , ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

Egate Enigma 315D సౌండ్ బార్ ను ఈరోజు 4 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం వుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :