Apple AirPods Pro 2 now available at lowest price ever from flipkart sale
Apple AirPods Pro 2 ఇయర్ బర్డ్స్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి పదివేల రూపాయల భారీ డిస్కౌంట్లతో ఎన్నడూ చూడనంత చవక ధరలో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ రీసెంట్ గా ప్రకటించిన బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్ నుంచి ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ ని ప్రకటించింది. ఈ ఇయర్ బర్డ్స్ ఇండియన్ మార్కెట్లో 25 వేల రూపాయల బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది. అయితే, ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఇప్పుడు బడ్జెట్ ధరలోనే లభిస్తుంది.
ఆపిల్ ఎయిర్ పోడ్స్ ప్రో 2 ఇయర్ బర్డ్స్ ఇండియన్ మార్కెట్లో రూ. 24,990 ధరతో లాంచ్ అయ్యాయి. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ ఫెస్టివల్ ధమాకా సేల్ నుంచి రూ. 8,500 భారీ డిస్కౌంట్ అందుకొని కేవలం రూ. 16,490 ధరకే లభిస్తున్నాయి. ఈ డిస్కౌంట్ కాకుండా ఈ బడ్స్ పై రూ. 1,649 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.
ఈ బడ్స్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఆపిల్ ఇయర్ బడ్స్ కేవలం రూ. 14,841 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ బడ్స్ లాంచ్ తర్వాత ఇదే అతి తక్కువ ధర అవుతుంది.
Also Read: Vivo V60e: మిడ్ రేంజ్ ప్రైస్ లో 200MP సూపర్ కెమెరాతో లాంచ్ అయ్యింది.!
ఈ ఆపిల్ ఎయిర్ పోడ్స్ ప్రో 2 ఇయర్ బడ్స్ ఆపిల్ యొక్క H2 chip తో వస్తుంది. ఇది అడ్వాన్స్ 3D సౌండ్ మరియు స్మార్ట్ నోయిస్ క్యాన్సిలేషన్ తో గొప్ప సౌండ్ అనుభూతిని ఆఫర్ చేస్తుంది. డిజైన్ పరంగా ఇది చాలా ప్రీమియం లుక్స్ కలిగి ఉంటుంది మరియు సాటిలేని సౌండ్ అందిస్తుంది. ఇందులో తక్కువ డిస్టార్షన్ కలిగిన కస్టమ్ బిల్ట్ స్పీకర్లు ఉంటాయి. ఇది క్రిస్టల్ క్లియర్ సౌండ్ తో పాటు గొప్ప హై నోట్స్ మరియు డీప్ బాస్ సౌండ్ అందిస్తుంది.
ఈ ఇయర్ బడ్స్ గొప్ప లిజనింగ్ ఎక్స్పీరియన్స్ కోసం 2x యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కలిగి ఉంటుంది. ఇది కాకుండా ఈ ఇయర్ బడ్స్ టైప్ C MagSafe Case తో వస్తుంది. కాలింగ్ కోసం ఈ బడ్స్ గొప్ప మైక్ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు గొప్ప కాలింగ్ సౌలభ్యాన్ని అందిస్తుంది.