Apple AirPods Max 2 launched and know the price and features
Apple AirPods Max 2: ప్రపంచ స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్ మరో లేటెస్ట్ ఆడియో డివైజ్ ను లాంచ్ చేసింది. అదే ఆపిల్ ఎయిర్ పోడ్స్ మాక్స్ 2 మరియు ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్ ను మరింత శక్తివంతమైన ANC మరియు బిగ్ బ్యాటరీతో అందించడం విశేషం. ఈ హెడ్ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన కంప్లీట్ వివరాలు అందిస్తున్నాము.
యాపిల్ ఈ పోడ్స్ ను ఇండియన్ మార్కెట్లో రూ. 67,900 ధరతో విడుదల చేసింది. ఈ బడ్స్ బ్లూ, పర్పుల్, మిడ్ నైట్, స్టార్ లైట్ మరియు ఆరెంజ్ కలర్ తో మొత్తం 5 రంగుల్లో ఈ పోడ్స్ ను అందించింది. ఈ బడ్స్ పై No Cost EMI మరియు అర్హత కలిగిన కార్డ్స్ పై రూ. 4,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆపిల్ హెడ్ ఫోన్ ను మార్చి 25వ తేదీ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. అయితే, వచ్చే నెల ప్రారంభం నుంచి అందుబాటులోకి వస్తుంది.
ఆపిల్ ఎయిర్ పోడ్స్ మాక్స్ 2 ను ఆపిల్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన డైనమిక్ డ్రైవర్స్ తో లాంచ్ చేసింది. ఇందులో కస్టమ్ హై డైనమిక్ రేంజ్ ఆమ్ప్లిఫైర్ ఉంటుంది. ఇది లీనమయ్యే గొప్ప సౌండ్ అందించే విధంగా ఉంటుంది. ఇది ఇరువైపులా Apple H2 headphone chip కలిగి ఉంటుంది. ఈ లేటెస్ట్ పోడ్స్ మరింత గొప్ప ANC సపోర్ట్, అడాప్టివ్ ఆడియో, వాయిస్ ఐసోలేషన్, లౌడ్ సౌండ్ రిడక్షన్ మరియు డైనమిక్ హెడ్ ట్రాకింగ్ సపోర్ట్ తో పర్సనలైజ్డ్ స్పేషియల్ ఆడియో వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఈ ఆపిల్ న్యూ హెడ్ ఫోన్ అన్ని లాంగ్వేజ్ లకు ఆటో ట్రాన్స్లేషన్ ఫీచర్ కలిగి ఉంటుంది. ఇదే కాదు ఈ హెడ్ ఫోన్ గొప్ప స్టూడియో క్వాలిటీ సౌండ్ తో ఆడియో రికార్డింగ్ కూడా చేయగలదు. అతి తక్కువ జాప్యంతో లాస్ లెస్ ఆడియో ఆఫర్ చేస్తుంది.
ఇక ఈ హెడ్ ఫోన్ కలిగిన సెన్సార్స్ విషయానికి వస్తే, ఇందులో ఆప్టికల్ సెన్సార్, పొజిషన్ సెన్సార్, కేసు డిటెక్టర్ సెన్సార్, యాక్సిలెరోమీటర్ మరియు గైరోస్కోప్ వంటి సెన్సార్లు ఉంటాయి. ఈ హెడ్ ఫోన్ సూపర్ కాలింగ్ ను ఆఫర్ చేస్తుంది. ఎందుకంటే, ఇందులో మూడు మైక్రో ఫోన్స్ ను నోయిస్ క్యాన్సిలేషన్ తో అందించింది. ఇందులో గొప్ప ANC కోసం 8 అదనపు మైక్రో ఫోన్స్ కూడా ఉంటాయి.
Also Read: Vivo T5x 5G: ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఎప్పుడూ చూడని స్టన్నింగ్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
ఆపిల్ ఎయిర్ పోడ్స్ మాక్స్ 2 బ్యాటరీ వివరాల్లోకి వెళితే, ఈ హెడ్ ఫోన్ సింగల్ ఛార్జ్ తో 20 గంటల ప్లే టైమ్ అందిస్తుంది. అది కూడా ANC ఎనేబుల్ తో ఈ ప్లే టైమ్ ఆఫర్ చేస్తుంది. అంటే, ఈ హెడ్ ఫోన్ ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే ANC తో 20 గంటలు నాన్ స్టాప్ గా ప్లే అవుతుంది. ఈ బడ్స్ బ్లూటూత్ వెర్షన్ 5.3 జతగా వస్తుంది మరియు టైప్ C పోర్ట్ కలిగి ఉంటుంది.