Amazon Prime Day Sale best and powerful soundbar deal revealed
Amazon Prime Day Sale నుంచి జబర్దస్త్ సౌండ్ బార్ ఆఫర్ అందుకోండి అంటోంది అమెజాన్ ఇండియా. ప్రైమ్ డే సేల్ జూలై 12వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందనగా, అమెజాన్ ఈరోజు భారీ సౌండ్ బార్ డీల్ ఒకటి రివీల్ చేసింది. ఈ జబర్దస్త్ ఆఫర్ తో డ్యూయల్ సబ్ ఉఫర్ తో వచ్చే 5.2 ఛానల్ Dolby సౌండ్ బార్ ను బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం ఉంది.
అమెజాన్ ప్రైమ్ డే సేల్ కంటే ముందు, ఈరోజు అమెజాన్ జెబ్రోనిక్స్ Juke BAR 9552 సౌండ్ బార్ జబర్దస్త్ ఆఫర్ ప్రకటించింది. ఈ సౌండ్ బార్ ను అమెజాన్ సేల్ నుంచి 76% భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 16,999 రూపాయల ఆఫర్ ధరకే సేల్ చేస్తుందిట.
అంతేకాదు, ఈ సౌండ్ బార్ ను అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి SBI మరియు ICICI క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే యూజర్లు రూ. 1,250 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందుకోవచ్చని అమెజాన్ తెలిపింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను అమెజాన్ సేల్ నుంచి కేవలం రూ. 15,749 రూపాయల అతి తక్కువ ధరకు పొందే వీలుంది.
Also Read: Samsung Galaxy Z Flip 7: ఎడ్జ్ టు ఎడ్జ్ ఫ్లెక్స్ విండో మరియు AI సపోర్ట్ తో లాంచ్ అయ్యింది.!
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 5.2 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 625W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ పెద్ద సైజు హాల్ ని సైతం షేక్ చేసే సత్తా కలిగి ఉంటుంది. ఎందుకంటే, ఈ సౌండ్ బార్ 120W సౌండ్ అవుట్ పుట్ అందించే రెండు సబ్ ఉఫర్లతో జబర్దస్త్ BASS సౌండ్ అందిస్తుంది. ఇది డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లతో గొప్ప సరౌండ్ సౌండ్ కూడా అందిస్తుంది. ఈ సౌండ్ బార్ తో వచ్చే బార్ లో మూడు స్పీకర్లు ఉంటాయి మరియు ఇది మీ టీవీ స్క్రీన్ నుంచే సౌండ్ వస్తుందా అనిపించేలా లీనమయ్యే సౌండ్ అందిస్తుంది.
ఇక ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ Dolby Audioసౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. అలాగే, HDMI Arc, USB, ఆప్టికల్, AUX మరియు బ్లూటూత్ వంటిది మల్టీ కనెక్టివిటీ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ పూర్తిగా వైర్లెస్ సెటప్ తో వస్తుంది కాబట్టి, ఈ సౌండ్ బార్ తో ఎటువంటి వైర్స్ బెడద ఉండదు.