LG Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ బిగ్ డీల్ అందుకోండి.!

Updated on 21-May-2025
HIGHLIGHTS

LG Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ బిగ్ డీల్ అందించింది

3.1.3 ఛానల్ సౌండ్ బార్ పై అమెజాన్ ఈ బిగ్ డీల్ అందించింది

ఈ సౌండ్ బార్ Dolby Atmos మరియు DTS: X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది

LG Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ ఇండియా ఈరోజు బిగ్ డీల్ అందించింది. ఇండియన్ మార్కెట్లో 3.1.3 ఛానల్ సపోర్ట్ మరియు డాల్బీ అట్మోస్ సపోర్ట్ తో అందించిన S77TY సౌండ్ బార్ పై అమెజాన్ ఈ బిగ్ డీల్ అందించింది. ఈ సౌండ్ బార్ ప్రస్తుతం LG ఆన్లైన్ స్టోర్ నుంచి అందుబాటులో ఉన్న ధరతో పోలిస్తే, ఈ సౌండ్ బార్ అమెజాన్ నుంచి చాలా తక్కువ ధరకు లభిస్తుంది. అమెజాన్ ఈ సౌండ్ బార్ పై అందించిన బిగ్ డీల్ మరియు ఈ సౌండ్ బార్ ఫీచర్స్ తెలుసుకుందామా.

LG Dolby Atmos సౌండ్ బార్ : ప్రైస్

LG యొక్క S77TY సౌండ్ బార్ ఇండియన్ మార్కెట్లో రూ. 44,990 ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ప్రస్తుతం LG ఆన్లైన్ స్టోర్ నుంచి రూ. 33,500 ధరతో లభిస్తోంది. కానీ, ఈ సౌండ్ బార్ అమెజాన్ నుంచి 52% భారీ డిస్కౌంట్ తో రూ. 26,490 రూపాయల బడ్జెట్ ధరలో ఆఫర్ చేస్తోంది.

అదనంగా, ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ నుంచి HDFC మరియు SBI కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ బ్యాంక్ ఆఫర్ తో ఈ ఎల్ జి సౌండ్ బార్ ను రూ. 24,490 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here

Also Read: Mega Tablet Premier League సేల్ నుంచి Apple iPad పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకోండి.!

LG Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ ఎల్ జి సౌండ్ బార్ 3.1.3 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 400W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో ముందు మూడు స్పీకర్లు మరియు పైన మూడు స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ VRR/ALLM /120Hz సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

ఈ సౌండ్ బార్ Dolby Atmos మరియు DTS: X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన ట్రిపుల్ లెవల్ స్పటియల్ సౌండ్ ఫీచర్ తో గొప్ప సరౌండ్ మరియు రూమ్ ఫిల్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ 24bit / 96kHz Hi-Res ఆడియో తో గొప్ప మ్యూజిక్ ను కూడా ఆస్వాదించవచ్చు. ఈ సౌండ్ బార్ HDMI, ఆప్టికల్, USB మరియు బ్లూటూత్ వంటి అన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :