Sony Dolby Atmos సౌండ్ బార్ పై రూ. 5,000 భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్.!

Updated on 27-Oct-2025
HIGHLIGHTS

Sony Dolby Atmos సౌండ్ బార్ పై రూ. 5,000 భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్

సోనీ రీసెంట్ గా విడుదల చేసిన సౌండ్ బార్ పై అమెజాన్ ఈ బిగ్ డీల్ అనౌన్స్ చేసింది

ఈ సౌండ్ బార్ జబర్దస్ సౌండ్ తో ఇంటిని సినిమా హాల్ గా మార్చేస్తుంది

Sony Dolby Atmos సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ ఇండియా ఈ రోజు రూ. 5,000 భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ మరియు వైర్లెస్ 5.1 ఛానల్ సెటప్ తో సోనీ రీసెంట్ గా విడుదల చేసిన పవర్ ఫుల్ సౌండ్ బార్ పై అమెజాన్ ఈ బిగ్ డీల్ అనౌన్స్ చేసింది. అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బిగ్ డీల్ పై ఒక లుక్కేద్దామా.

Sony Dolby Atmos సౌండ్ బార్ : అమెజాన్ ఆఫర్

సోనీ 5.1 ఛానల్ సౌండ్ బార్ HT-S2000 పై అమెజాన్ ఈరోజు ఈ బిగ్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి 49% భారీ డిస్కౌంట్ తో రూ. 59,991 ఆఫర్ ప్రైస్ తో లిస్ట్ అయ్యింది. ఈ సౌండ్ బార్ పై ఆల్ బ్యాంక్ కార్డ్ రూ. 5,000 బిగ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అమెజాన్ ఈరోజు అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ని కేవలం రూ. 54,991 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు. Buy From Here

Also Read: సేల్ ముగిసిన తర్వాత కూడా MOTOROLA G86 Power 5G పై భారీ డిస్కౌంట్ అందుకోండి.!

Sony Dolby Atmos సౌండ్ బార్: ఫీచర్స్

ఈ సోనీ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ లో మూడు స్పీకర్లు మరియు పవర్ ఫుల్ డ్యూయల్ ఉఫర్ సెటప్ తో మొత్తం 5 స్పీకర్లు కలిగిన బార్ ఉంటుంది. దానికి జతగా డ్యూయల్ వైర్లెస్ శాటిలైట్ స్పీకర్లు మరియు వైర్లెస్ సబ్ ఉఫర్ కూడా ఉంటాయి. ఈ సౌండ్ బార్ జబర్దస్ సౌండ్ తో ఇంటిని సినిమా హాల్ గా మార్చేస్తుంది మరియు ఈ ఆడియో ఎక్స్ పీరియన్స్ ని మరింత గొప్పగా మారుస్తుంది.

ఇక ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ టెక్నాలాజి విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ మరియు DTSX సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ వర్టికల్ సరౌండ్ ఇంజిన్ మరియు S- ఫోర్స్ ప్రో ఫ్రంట్ సరౌండ్ సౌండ్ ఫీచర్ తో కూడా వస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI eArc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు HEC App సపోర్ట్ తో కూడా పని చేస్తుంది. ఈ సౌండ్ బార్ జబర్దస్త్ సరౌండ్ మరియు గొప్ప డీప్ బాస్ సౌండ్ తో మీ ఆడియో అనుభూతిని పూర్తిగా మార్చేస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :