WhatsApp Schedule Message ఫీచర్ వచ్చేసింది .. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.!
WhatsApp Schedule Message ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది
ఈ కొత్త ఫీచర్ ద్వారా ముందుగానే మెసేజ్ టైప్ చేసి సెండ్ సమయాన్ని మీరు నిర్ణయించవచ్చు
మీరు నిర్ణయించిన సమయానికి వాట్సాప్ ఆటోమేటిక్ గా ఆ మెసేజ్ ను పంపిస్తుంది
గత కొంతకాలంగా వార్తల్లో నిలిచిన WhatsApp Schedule Message ఫీచర్ ఇప్పుడు iOS మరియు ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చేసింది. సాధారణంగా మనం ఎవరికైనా మెసేజ్ పంపాలంటే మెసేజ్ టైప్ చేసి అదే సమయంలో పంపించాల్సి ఉంటుంది. అయితే, ఈ కొత్త ఫీచర్ ద్వారా ముందుగానే మెసేజ్ టైప్ చేసి, అది ఎప్పుడు సెండ్ అవ్వాలో తేదీ మరియు సమయాన్ని మీరు నిర్ణయించవచ్చు. ఇలా సెట్ చేసిన తర్వాత మీరు నిర్ణయించిన సమయానికి వాట్సాప్ ఆటోమేటిక్ గా ఆ మెసేజ్ ను పంపిస్తుంది. ఈ కొత్త ఫీచర్ Android మరియు iOS రెండు ప్లాట్ ఫామ్స్ లోకి వచ్చింది.
WhatsApp Schedule Message
గత నెల నుంచి ఈ ఫీచర్ బీటా వెర్షన్ లో యూజర్ల ద్వారా పరీక్షించబడుతోంది. అయితే, ఈ ఫీచర్ ఇప్పుడు యూజర్లు అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ మీ ఫోన్ లో కనిపించక పోయినట్లయితే, మీ ఫోన్ లో వున్నా వాట్సాప్ యాప్ అని లేటెస్ట్ వెర్షన్ తో అప్డేట్ చేయండి.
WhatsApp Schedule Message ఎలా చేయాలి?
- ముందుగా మీ ఫోన్ లో WhatsApp యాప్ ను ఓపెన్ చేయండి.
- మీరు మెసేజ్ పంపాలనుకుంటున్న వ్యక్తి లేదా గ్రూప్ చాట్ ను ఎంచుకోండి.
- పంపించాల్సిన మెసేజ్ ను టైప్ చేయండి.
- ఇప్పుడు Send బటన్ పై ఎక్కువసేపు (Long Press) ప్రెస్ చేయండి.
- మీకు స్క్రీన్ పై Schedule Message ఆప్షన్ కనిపిస్తుంది ఎంచుకోండి.
- మెసేజ్ వెళ్లాల్సిన తేదీ మరియు సమయాన్ని సెట్ చేయండి.
- చివరగా Confirm లేదా Schedule బటన్ పై క్లిక్ చేయండి.
అంతే, మీరు ముందుగా షెడ్యూల్ చేసిన సమయానికి ఆ మెసేజ్ వాట్సాప్ ద్వారా ఆటోమేటిక్గా సెండ్ చేయబడుతుంది. కనీసం 10 నిమిషాల నుంచి గరిష్టంగా రెండు వారాల వరకు ముందుగానే మీరు మెసేజ్ సెండ్ కోసం సమయాన్ని ఎంచుకోవచ్చు.
ఈ ఫీచర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు, ముఖ్యమైన రిమైండర్లు మరియు ఆఫీస్ సమాచారం వంటి మెసేజ్ లను ముందుగానే సిద్ధం చేసుకోవచ్చు. వ్యక్తిగత చాట్స్ తో పాటు గ్రూపుల్లో కూడా మెసేజ్ లను షెడ్యూల్ చేసే అవకాశం ఉంది. ఈ ఉరుకుల పరుగుల బిజీ రోజుల్లో సమయానికి విషెస్ అండ్ రిమైండర్స్ కోసం ఈ కొత్త ఫీచర్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది.
షెడ్యూల్ చేసిన మెసేజ్ తొలగించవచ్చా?
అవును, షెడ్యూల్ చేసిన మెసేజ్ లను చాట్ ఇన్ఫో విభాగంలోని ప్రత్యేక సెక్షన్ లో చూసుకోవచ్చు. అంతేకాదు, ఒకవేళ మీరు షెడ్యూల్ చేసిన మెసేజ్ డిలీట్ చేయాలనుకుంటే, పంపించే సమయానికి ముందే వాటిని తగ్గించుకునే అవకాశం కూడా వాట్సాప్ అందించింది. ఒకవెళ మీ ఫోన్ లో ఈ కొత్త ఫీచర్ లేదా ఆప్షన్ కనిపించకపోతే, మీ ఫోన్ లో ఈ అప్డేట్ కోసం వేచి చూడాల్సి ఉంటుంది.