New Year 2026 కోసం వాట్సాప్ అద్భుతమైన స్పెషల్ ఫీచర్లు జత చేసింది.!

Updated on 31-Dec-2025
HIGHLIGHTS

New Year 2026 విషెస్ మరియు స్టేటస్ కోసం మీ ఫోన్ లోనే కొత్త ఫీచర్స్ వచ్చేశాయి

వాట్సాప్ లో న్యూ ఇయర్ 2026 విషెస్ చెప్పడానికి మీకు సరికొత్త ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి

వాట్సాప్ వాడకం మరింత గొప్పగా మరియు మంచి ఎంగేజింగ్‌ గా మారనుంది

New Year 2026 విషెస్ మరియు స్టేటస్ కోసం ఎటువంటి ఇతర యాప్స్ తో అవసరం లేకుండా వాట్సాప్ అద్భుతమైన స్పెషల్ ఫీచర్లు జత చేసింది. కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి చాలామంది థర్డ్ పార్టీ యాప్స్ లేదా AI యాప్స్ సహాయం తీసుకుంటూ ఉంటారు. అయితే, ఇప్పుడు అటువంటి అవసరం లేకుండా వాట్సాప్ లో న్యూ ఇయర్ 2026 విషెస్ చెప్పడానికి మీకు సరికొత్త ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి. వాట్సాప్ లో వచ్చిన కొత్త ఫీచర్స్ ఏమిటి? వాటిని ఎలా ఉపయోగించాలి? అని వివరంగా చూద్దామా.

New Year 2026 : WhatsApp కొత్త ఫీచర్స్

ప్రపంచం వ్యాప్తంగా మరియు దేశంలో కూడా అత్యధికంగా వాడే మెసేజింగ్ యాప్ వ్ వాట్సాప్ మరోసారి యూజర్లకు కొత్త సర్‌ప్రైజ్ ఇచ్చింది. 2026 న్యూ ఇయర్‌ ను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయడానికి కొత్త ఫీచర్లు, విజువల్ ఎఫెక్ట్స్, స్టిక్కర్లు మరియు వీడియో కాల్ అప్‌డేట్స్‌ విడుదల చేసింది. ఈ అప్‌డేట్స్‌తో వాట్సాప్ వాడకం మరింత గొప్పగా మరియు మంచి ఎంగేజింగ్‌గా మారనుంది.

New Year 2026 కోసం కొత్త స్టిక్కర్ ప్యాక్

కొత్త సంవత్సరం కోసం వాట్సాప్ ప్రత్యేకంగా 2026 న్యూ ఇయర్ స్టిక్కర్లు విడుదల చేసింది. ఈ కొత్త స్టిక్కర్స్ తో మీకు నచ్చిన వారికి కలర్‌ ఫుల్ అండ్ వినుత్నమైన విషెస్ పంపొచ్చు.

వీడియో కాల్ ఎఫెక్ట్స్

2026 న్యూ ఇయర్ సందర్భంగా వీడియో కాల్ కోసం కూడా కొత్త ఎఫెక్ట్స్ జత చేసింది. మేరకు వీడియో కాల్ చేసేటప్పుడు, ఫైర్‌వర్క్స్, కాన్ఫెట్టి మరియు స్టార్స్ వంటి కొత్త ఎఫెక్ట్స్ జత చేయవచ్చు. మీరు లైవ్ లో కొత్త సంవత్సర వేడుక చేసుకోవడానికి సహాయం చేస్తుంది. అంతేకాదు, వీడియో కాల్ మిస్ అయితే మీరు వీడియో నోట్ సెండ్ చేయవచ్చు.

యానిమేటెడ్ రియాక్షన్

ఇప్పుడు మీరు మీ చాట్‌లో ఎమోజీలతో రియాక్ట్ చేస్తే వాటిలో యానిమేటెడ్ కాన్ఫెట్టి ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. ఇది మీ చాటింగ్ స్కె పీరియన్స్ ను మరింత లవ్లీ గా మారుస్తుంది.

స్టేటస్ అప్‌డేట్స్‌ లో కొత్త మార్పులు

ఎప్పుడూ లేనిది మొదటిసారిగా స్టేటస్‌లో యానిమేటెడ్ స్టిక్కర్లు యాడ్ చేసే అవకాశాన్ని వాట్సాప్ అందించింది. న్యూ ఇయర్ విషెస్ స్టేటస్ పెట్టే వారికి ఇది మంచి ఉపయోగకరమైన ఫీచర్ గా ఉంటుంది.

Also Read: Poco M8 5G లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన పోకో.. అంచనా ఫీచర్స్ కూడా తెలుసుకోండి.!

గ్రూప్ చాట్ మరియు కాల్ కోసం కొత్త ఫీచర్లు

గ్రూ కాల్ కోసం చాలా అవసరమైన మరియు అనువైన ఫీచర్స్ వాట్సాప్ కొత్తగా యాప్ లో జత చేసింది. అదేమిటంటే, ఇక పై గ్రూప్‌ లో కాల్ కోసం ముందుగానే వీడియో లేదా వాయిస్ కాల్స్ షెడ్యూల్ చేయవచ్చు.

ఈ కొత్త ఫీచర్స్ ను కొత్త అప్డేట్ తో రోల్ అవుట్ చేసింది. మీరు ఈ కొత్త ఫీచర్స్ తో న్యూ ఇయర్ విషెస్ కొత్తగా పంపించవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :