WhatsApp కొత్త ఫీచర్: యాప్ లోనే eSIM కొనుగోలు చేసే అవకాశం అందించిన వాట్సాప్.!
WhatsApp కొత్త ఫీచర్ తో యూజర్లకు కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది
వాట్సాప్ కొత్త eSIM సదుపాయాన్ని తీసుకొస్తోంది
వాట్సాప్ యాప్ నుంచే యూజర్లు eSIM ను కొనుగోలు చేయవచ్చు
WhatsApp కొత్త ఫీచర్ తో విదేశాలకు ప్రయాణించే యూజర్లకు కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. అంతర్జాతీయ ప్రయాణాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ప్రత్యేకంగా లోకల్ SIM కార్డు కొనుగోలు చేయడం లేదా ఖరీదైన రోమింగ్ ప్లాన్లపై ఆధారపడాల్సిన అవసరాన్ని తగ్గించే విధంగా వాట్సాప్ కొత్త eSIM సదుపాయాన్ని తీసుకొస్తోంది. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ యాప్ నుంచే యూజర్లు ట్రావెల్ eSIM ను కొనుగోలు చేసి, ఇన్ స్టాల్ చేసుకునే అవకాశం కల్పించనుంది.
WhatsApp కొత్త ఫీచర్
సాధారణంగా విదేశాలకు వెళ్లినప్పుడు మొబైల్ ఇంటర్నెట్ ఉపయోగించడానికి స్థానిక సిమ్ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మన దేశంలో ఉన్న టెలికాం ఆపరేటర్ అందించే ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ యాక్టివేట్ చేసుకోవాలి. ఈ రెండు మార్గాలు కూడా యూజర్ల సమయం మరియు డబ్బు ఖర్చు చేసే మార్గాలుగా ఉంటాయి. ఈ ఇబ్బందులను తగ్గించేందుకు వాట్సాప్ తెచ్చిన ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడుతుంది. వాట్సాప్ యూజర్లు యాప్ లోనే అందుబాటులో ఉండే కొత్త eSIM ఆప్షన్ ద్వారా తమ ప్రయాణానికి అవసరమైన డేటా ప్లాన్ ఎంచుకోవచ్చు.
వాట్సాప్ కొత్తగా తెచ్చిన eSIM సదుపాయంతో యూజర్లు విదేశాల్లో ఉన్నప్పటికీ ఇంటర్నెట్ ద్వారా వాట్సాప్ చాటింగ్, వాయిస్ కాల్స్ మరియు వీడియో కాల్స్ కూడా నిరాటంకంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా, కొత్త సిమ్ కార్డు తీసుకున్నా కూడా యూజర్ తన వాట్సాప్ అకౌంట్ మార్చాల్సిన అవసరం ఉండదు. యూజర్ ఇప్పటికే ఉపయోగిస్తున్న అదే వాట్సాప్ నంబర్ తోనే యాప్ ను కొనసాగించవచ్చు. అయితే, ఒక ఇక్కడ చిన్న మెలిక ఉంది. అదేమిటంటే, eSIM కు సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్ యూజర్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.
WhatsApp కొత్త ఫీచర్ భాగస్వామ్యం ఎవరు?
ఈ సేవ కోసం వాట్సాప్ పలు టెలికాం eSIM భాగస్వామ్య సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఇందులో Jio, Smart Axiata, Smart Communications మరియు Verizon వంటి సంస్థల పేర్లు ప్రస్తావించింది.
ప్రస్తుతం ఈ ఫీచర్ ను ఎంపిక చేసిన ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, భారత్ లో ఎప్పటి నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందో మరియు ఈ eSIM డేటా ప్లాన్ ధరలు ఎంత ఉంటాయో, అనే వివరాలు వాట్సాప్ ఇంకా వెల్లడించలేదు.
ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది?
వాట్సాప్ ప్రకారం, ఈ ఫీచర్ ను త్వరలోనే ఎంపిక చేసిన దేశాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. అందరికీ ఒకేసారి విడుదల చేయడం లేదు. అర్హత ఉన్న యూజర్లకు వారి వాట్సాప్ యాప్ లోనే ఈ ఆప్షన్ కనిపిస్తుంది. అలాగే, eSIM అందుబాటులో ఉన్న దేశంలో మాత్రమే ఈ సర్వీస్ ను ఉపయోగించగలుగుతారు.