WhatsApp App: వాట్సాప్ స్టేటస్ అప్డేట్ లో కొత్త ఫీచర్స్ యాడ్ చేసిన వాట్సాప్.!

Updated on 30-May-2025
HIGHLIGHTS

ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించబడే మెసేజింగ్ యాప్ వాట్సాప్

వాట్సాప్ కొత్త అప్డేట్ తో కొత్త ఫీచర్ అందుకుంది

వాట్సాప్ స్టేటస్ అప్డేట్ లో ఈ కొత్త ఫీచర్ ను అందించింది

వాట్సాప్ స్టేటస్ లో కొత్త మ్యూజిక్, స్టిక్కర్స్ మరియు లే అవుట్ లను జత చేసింది

WhatsApp App: ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించబడే మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త పడేట్టు తో కొత్త ఫీచర్ అందుకుంది. అది కూడా వాట్సాప్ యూజర్లు అత్యధికంగా ఉపయోగించే వాట్సాప్ స్టేటస్ అప్డేట్ లో ఈ కొత్త ఫీచర్ ను అందించింది. ఈ కొత్త ఫీచర్స్ తో యూజర్ లకు వారి స్టేటస్ అప్డేట్ ను ఉపయోగించడం మరింత సౌకర్యవంతంగా మరియు ఆహ్లాదకరంగా మారింది.

WhatsApp App: ఏమిటా కొత్త ఫీచర్

వాట్సాప్ స్టేటస్ అప్డేట్ ను వచ్చిన నాటి నుంచి ఈ ఫీచర్ ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్ లను అందుకుంటూనే ఉంది. ఇటీవల ఈ ఫీచర్ లో ఇమేజ్ లేదా వీడియో లో సాంగ్ సెట్ చేసుకునే ఫీచర్ అందించిన వాట్సాప్ ఇప్పుడు మరో ఫీచర్ ను కూడా ఈ అప్డేట్ లో అందించింది. అదేమిటంటే, వాట్సాప్ స్టేటస్ లో కొత్త మ్యూజిక్, స్టిక్కర్స్ మరియు లే అవుట్ లను జత చేసింది.

వాట్సాప్ కొత్తగా అందించిన ఈ ఫీచర్ తో వాట్సాప్ యూజర్లు వారి స్టేటస్ లో మల్టీ ఫుల్ ఫోటోలతో లే అవుట్, అంటే గ్రిడ్ టైప్ స్టేటస్ ను సెట్ చేసుకోవడమే కాకుండా ఆ స్టేటస్ కు వాట్సాప్ ఆఫర్ చేసే మ్యూజిక్ ను కూడా సెట్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఇదే స్టేటస్ అప్డేట్ లో స్టిక్కర్స్ కూడా జత చేసింది, సింపుల్ గా చెప్పాలంటే, ఫోటో లే అవుట్ ను మ్యూజిక్ మరియు స్టికర్స్ తో సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ తో యూజర్లు వారి స్టేటస్ అప్డేట్ ను మరింత గొప్పగా క్రియేట్ చేసుకొని షేర్ చేసే అవకాశం ఉంటుంది.

Also Read: Nothing Phone (2) ఫోన్ పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్ అందుకోండి.!

వాట్సాప్ స్టేటస్ అప్డేట్ ను కొత్తగా ఎలా సెట్ చేయాలి?

ముందుగా వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి స్టేటస్ అప్డేట్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు స్టేటస్ అప్డేట్ కోసం ఫోటో మరియు వీడియో గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇందులో పైన Text, Layout మరియు Voice మూడు టాబ్స్ ఉంటాయి. ఇందులో, Layout టాబ్ పైన నొక్కగానే మీ ఫోటోలు మరియు వీడియో గ్యాలరీ ఓపెన్ అవుతుంది, వీటిలో మీకు నచ్చిన ఫోటోలు (ఒకటి కంటే ఎక్కువ) ఎంచుకొని క్రింద కనిపించే రైట్ టిక్ పై ఎంచుకోండి. వెంటనే మీరు సెలక్ట్ చేసుకున్న ఫోటోలతో కూడిన లే అవుట్ ప్రత్యక్షమవుతుంది.

మీరు ఎంచుకునే ఫోటో సంఖ్య కు అనుగుణంగా లే అవుట్ అందిస్తుంది. ఇందులో 2 నుంచి 6 ఫోటోల వరకు ఎంచుకోవచ్చు. ఈ లే అవుట్ ఫోటో సెట్ చేసి డన్ పై నొక్కగానే అప్డేట్ పోస్ట్ ఫైనల్ టచ్ కు చేరుకుంటారు. ఇక్కడ పైన వుండే మ్యూజిక్ సింబల్ పై నొక్కండి ఇక్కడ వాట్సాప్ అందించే అనేక మ్యూజిక్ ఆప్షన్ లు కనిపిస్తాయి. ఇందులో మీకు నచ్చిన మ్యూజిక్ ను మీ వాట్సాప్ స్టేటస్ కు యాడ్ చేసుకోండి. చివరిగా ఇదే ఫోటో లే అవుట్ స్టేటస్ కు కోరుకునే స్టికర్, టైం లేదా లొకేషన్ వంటి వాటిని యాడ్ చేసుకోండి.

అంతే, వాట్సాప్ కొత్త ఫీచర్ తో కూడిన మీ కొత్త వాట్సాప్ స్టేటస్ అప్డేట్ రెడీ అవుతుంది. దీని ఒకసారి చెక్ చేసి మీకు ఒకే అనిపిస్తే షేర్ చేయండి. సింపుల్ గా మీ వాట్సాప్ స్టేటస్ అప్డేట్ ఇప్పుడు మరింత అట్రాక్టివ్ గా షేర్ చేసుకునేలా ఈ ఫీచర్ ను వాట్సాప్ అందించింది. దీనికోసం ఎటువంటి అదనపు యాప్ తో అవసరం కూడా ఉండదు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :