Spotify మ్యూజిక్ ఆప్: వచ్చిన వారంలోనే 10 లక్షల మంది వినియోగదారులను సాధించింది

HIGHLIGHTS

ఇందులో ఒక సారి Sign-Up అయిన తరువాత మీరు ఉచితంగా ఈ సర్వీసును పొందవచ్చు.

Spotify మ్యూజిక్ ఆప్: వచ్చిన వారంలోనే 10 లక్షల మంది వినియోగదారులను సాధించింది

Spotify  App మ్యూజిక్ ఆప్ విడుదలయ్యి వరం రోజులవుతుంది, ఈ గడచినా వారంలోనే ఇది 10 లక్షల మంది వినియోగదారుల్ని సంపాదించింది. మంచి క్వాలిటీ మ్యూజిక్ మరియు అత్యధిక రిజల్యూషన్ తో మ్యూజిక్ అందించడమేకాకుండా, 119 రూపాయల విలువగల ఒక నెల ప్రీమియం సబ్ స్క్రిప్షన్ను ఉచితంగా అందిచండం కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు. మంచి మ్యూజిక్ వినాలని కోరుకునే సంగీత ప్రియులకి ఇది సరిగ్గా సరిపోతుంది. అలాగే, ఇందులో 4 కోట్ల వరకు పాటలు మరియు మిలియన్ల కొద్దీ ప్లే లిస్టులను కూడా అందిస్తోంది. ఇక తెలుగులో కొత్త సాంగ్స్ మరియు ట్రెండీ ప్లే లిస్ట్ లను ఇందులో చాల సులభంగా అందిస్తోంది.       

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Spotify  App 

Spotify App ఇప్పుడు వెబ్ ఆప్, డెస్క్ టాప్ ఆప్, ఆండ్రాయిడ్ మరియు iOS కోసం అందించడింది. దీనితో, పాటుగా iTunes App కూడా ఇప్పుడు live చేయబడింది.  వినియోగదారులు ఎటువంటి VPN (వెరిఫికేషన్ పిన్ నంబర్) అవసరం లేకుండానే చాల సులభంగా దీనికి Sign-Up అవ్వవచ్చు. అంటే, facebook లేదా ఈమెయిలు వంటి గొడవలేకుండానే  మీరు దీనికి Sign-Up అవ్వవచ్చు.

దీనితో మంచి క్వాలిటీతో ఆడియోని ఎంజాయ్ చేయవచ్చు. ఇందులో ఒక సారి Sign-Up అయిన తరువాత మీరు ఉచితంగా ఈ సర్వీసును పొందవచ్చు, లేదా మరిన్ని ఇతర ఫిచర్లను పొందాలనుకుంటే, ప్రీమియం కు అప్డేట్ అవ్వవచ్చు. ప్రీమియం అప్డేట్ చేసుకోవడానికి, ఒకరోజు నుండి మొదలు కొని సంవత్సరం వరకు అనేక ప్లాన్స్ అందించింది. ఒకరోజుకు గాను 13 రూపాయలు చల్లించాల్సి ఉంటుంది, ఇక వారానికి అంటే,7 రోజులకు గాను 39 రూపాయలను చెల్లించవల్సి ఉంటుంది.

ఇక ఈ మ్యూజిక్ ఆప్ గురించి చూస్తే, ఇందులో కావాల్సిన భాషను మరియు నచ్చిన సింగర్ ని ఎంచుకోవచ్చు. అలాగే, మంచి ఎక్వలైజెర్ సెటింగులతో పాటుగా ఎన్నో ఎంపికలు మీకు అందుబాటులో ఉంచింది. ఇక ప్రీమియం విషయానికి వస్తే, ఒక 30 రోజుల ఉచిత ట్రయిల్ అందిస్తోంది ఈ ఆప్, కాబట్టి దీన్ని ప్రీమియం అప్డేట్ ని 30 రోజుల పాటు ఉచితంగా పొందవచ్చు. ప్రీమియం కోసం మారడం ద్వారా 3 రేట్లు క్వాలిటీ గల మ్యూజిక్ తో పాటుగా ఎటువంటి యాడ్స్ మిమ్మల్ని మీకు మీజిక్ మధ్యలో బాధించవు. అలాగే, మీకు నచ్చిన సాంగ్స్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo