డెవలపర్స్ కోసం కొత్త Codex App ని పరిచయం చేసిన Open AI

HIGHLIGHTS

Open AI ఇప్పుడు సరికొత్త ఆవిష్కరణ అందించింది

macOS లో పని చేసే డెవలపర్స్ కోసం కొత్త Codex App ని పరిచయం చేసింది

కోడింగ్ మరింత సమర్థవంతంగా చేయడానికి రూపొందించిన ఒక డెడికేటెడ్ AI టూల్

చాట్ జిపిటి తో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లో కొత్త శకానికి బాటలు వేసిన Open AI ఇప్పుడు సరికొత్త ఆవిష్కరణ అందించింది. ఓపెన్ ఎఐ ఇప్పుడు యాపిల్ macOS లో పని చేసే డెవలపర్స్ కోసం కొత్త Codex App ని పరిచయం చేసింది. ఇది సాఫ్ట్‌ వేర్ డెవలప్‌మెంట్ (కోడింగ్) పనులు మరింత సాఫీగా మరియు మరింత సమర్థవంతంగా చేయడానికి రూపొందించిన ఒక డెడికేటెడ్ AI టూల్. ఈ కొత్త కోడెక్స్ యాప్ గురించి క్లుప్తంగా తెలుసుకోండి.

Open AI Codex App ఏమిటి ఇది?

పైన తెలిపినట్లుగా, కొడెక్స్ యాప్ అనేది సాఫ్ట్‌ వేర్ డెవలప్‌మెంట్ (కోడింగ్) పనులు మరింత సాఫీగా మరియు మరింత సమర్థవంతంగా చేయడానికి రూపొందించిన ఒక డెడికేటెడ్ AI టూల్. ఓపెన్ ఎఐ ఒక AI ఆధారిత కోడింగ్ అసిస్టెంట్ లేదా ఏజెంట్ పని చేస్తుంది మరియు ఇది వివిధ కోడింగ్ పనులు ఆటోమాటిగ్గా నిర్వహించగలదు. కోడ్ రాయడం, బగ్స్ సరిచేయడం, ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం వంటి పనులు ఇది చేపడుతుంది.

ఇది కొత్త డెస్క్ టాప్ అనుభవం అందిస్తుంది. ఎందుకంటే, ఇది ముఖ్యంగా మల్టీ ఏజెంట్ వర్క్‌ ఫ్లో కోసం డిజైన్ చేయబడింది. అంటే, ఒకే ప్రాజెక్ట్ మీద అనేక కోడెక్స్ ఏజెంట్లను ఒకేసారి నడపవచ్చు మరియు పనులను ఒకే సమయంలో పేర్లల్ గా నిర్వహించవచ్చు. ఈ కొత్త యాప్ తో మరిన్ని పనులు కూడా సులభతరం చేస్తుంది. అంటే, ప్రాజెక్ట్ టాస్క్‌లు ఒకేసమయంలో నిర్వహించడం, కోడ్ మార్పులను రివ్యూ చేసి క్యూవ్ చేయడం మరియు యూజర్ ఎడిటర్‌ లో మార్పులను తెరచి అవసరమైతే మానువల్ గా సవరించడం వంటి వాటిని ఒకే సమయంలో నిర్వహించవచ్చు.

ఈ విధంగా కోడెక్స్ యాప్ కోడింగ్ ప్రాజెక్ట్‌ లను కంప్లీట్ లైఫ్‌ సైకిల్ మేనేజ్‌మెంట్ టూల్ లా పనిచేయిస్తుంది. ఇంతవరకు IDE లేదా టెర్మినల్ లు జరిపించిన పనులన్నీ ఒకే చోట సమగ్రంగా చేయగలదు.

Also Read: Sony 5.1 Dolby Atmos సౌండ్ బార్ పై రూ. 10,000 భారీ డిస్కౌంట్ అందుకోండి.!

Open AI Codex App: అదనపు

కోడెక్స్ యాప్ సింపుల్ అనేది కేవలం కోడ్ జనరేషన్ చేయడమే కాదు Skills అనే ప్రత్యేక టూల్‌ కోసం కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ స్కిల్స్ అనేది కోడెక్స్‌ కు అవసరమైన ఫీచర్స్, స్క్రిప్ట్‌లు, సూచనలు కలిపి ఒక ఫంక్షన్ గా మార్చి, ఆటోమేటిక్ గా పని చేసే శక్తిని కలిగి ఉంటాయి. అంటే, Figma డిజైన్ నుండి UI కోడ్ తయారీ మరియు క్లౌడ్‌లకు యాప్ డిప్లాయ్‌మెంట్ వంటి పనులు చేస్తుందని ఉదాహరణగా చెప్పొచ్చు.

ఇది ఎలా ఉపయోగించాలి?

కోడెక్స్ యాప్ ప్రస్తుతం macOS కోసం విడుదలయింది. ఇది Chart GPT Plus, Pro, Business, Enterprise మరియు Edu ప్లాన్లతో అందుబాటులో ఉంది. అయితే, ఫ్రీ యూజర్ల కోసం కూడా ఒక పరిమిత కాలానికి Chat GPT Free అండ్ Go వినియోగదారులకు కూడా ఉపయోగపడుతుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :