Instagram Down and users seen video upload and music features issues
Instagram Down: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఈరోజు చాలా సమస్యలు చూసినట్లు వెల్లడించారు. వీడియో అప్లోడ్ తో పాటు మరిన్ని ఫీచర్స్ ఇన్స్టాగ్రామ్ లో పనిచేయడం లేదని యూజర్లు గగ్గోలు పెట్టారు. X ప్లాట్ ఫామ్ సాక్షిగా ఇన్స్టాగ్రామ్ డౌన్ అయిన విషయం గురించి ట్వీట్స్ తో వెల్లువెత్తారు.
ప్రపంచం నలువైపులా వేల కొద్ది ఇన్స్టాగ్రామ్ యూజర్లు వీడియో అప్లోడ్ మరియు మ్యూజిక్ ఫీచర్ తో సహా మరికొన్ని సమస్యలు చూసినట్లు తెలిపారు. ఇందులో 70 శాతం మంది యూజర్లు యాప్ లో సమస్య చూస్తే, 14 శాతం మంది సర్వర్ కారణంగా సమస్యలు ఎదుర్కొన్నట్లు చెబుతున్నారు.
ప్రముఖ ఔటేజ్ మోనిటరింగ్ సైట్ Downdetector పై దాదాపు 1,500 వందలకు పైగా ఇన్స్టాగ్రామ్ యూజర్లు యాప్ డౌన్ గురించి కంప్లైంట్ చేశారు. అక్కడి నుంచే ఇన్స్టాగ్రామ్ డౌన్ అయిన విషయం బయటకు వచ్చింది. ఇది ఇది కాకుండా X ఫ్లాట్ ఫామ్ పై కూడా ఈ విషయాన్ని తమ ట్వీట్స్ ద్వారా వెల్లడించారు.
ఇంకేముంది ఈ విషయం X ప్లాట్ ఫామ్ పై వేగంగా ట్రెండ్ గా మారింది మరియు యూజర్స్ అటెన్షన్ అందుకుంది. ఇక X అకౌంట్ నుంచి యూజర్స్ షేర్ చేసిన ట్వీట్లు కొత్తగా కనిపించాయి. ఇక మచ్చుకు కొన్ని అందిస్తున్నాము.
అన్నింటికన్నా ముందు #instagram #down హ్యాష్ టాగ్స్ X ప్లాట్ ఫామ్ పై ట్రేండింగ్ గా మారాయి. అలాగే, ఎక్కువ మంది యూజర్లు Why is Instagram Always Down అనే ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు. కొంతమందైతే మీ ఫోన్ లో ఏదో వైరస్ ఉందని బయపడకండి, జస్ట్ ఇన్స్టాగ్రామ్ డౌన్ అయింది అంతే అని జోక్స్ వేస్తున్నారు.
Also Read: Realme GT 7 Pro : ప్రీ బుకింగ్ మొదలు పెట్టిన కంపెనీ.. కంప్లీట్ ఫీచర్స్ కూడా విడుదల.!
ఇలా ఇన్స్టాగ్రామ్ పై పలువురు పలు రకాల జోక్స్ వేస్తూ ఇన్స్టాగ్రామ్ డౌన్ అయిన విషయాన్ని చర్చిస్తున్నారు.