వాట్స్ఆప్ బెస్ట్ ట్రిక్: ఇంటర్నెట్ ఆఫ్ చెయ్యకుండా Whatsapp Offline చెయ్యొచ్చు

Updated on 31-Jan-2022
HIGHLIGHTS

వాట్స్ఆప్ లో మనకు తెలియని చాలా ట్రిక్స్ ఉన్నాయి

ఈ లేటెస్ట్ వాట్స్ఆప్ ట్రిక్స్ మీకు తెలుసా?

ఇంటర్నెట్ ను ఆఫ్ చెయ్యకుండానే Whatsapp ని ఆఫ్ చేయవచ్చు

మీటింగ్ లేదా క్లాస్ రూమ్ లో లేదా మరింకేదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు వచ్చే Whatsapp నోటిఫికేషన్స్ ఒక్కోసారి చికాకు కలిగించవచ్చు. ఇదే సమస్య అయితే ఈరోజు ఈ సమస్యకు మంచి పరిస్కారాన్ని పొందబోతున్నారు. వాట్స్ఆప్ లో అందరికీ తెలియని చాలా ట్రిక్స్ మరియు టిప్స్ ఉన్నాయి. అవసరాన్ని బట్టి మనం వాటిని ఉపయోగించుకోవచ్చు. ఈరోజు మనం అలాంటి ట్రిక్ ను గురించి తెలుసుకోబోతున్నాము. 

అదేమిటంటే, మీ ఫోన్ ఇంటర్నెట్ ను ఆఫ్ చెయ్యకుండానే Whatsapp ని ఆఫ్ ను చేయడం. మీరు ఇంపార్టెంట్ పనిలో ఉన్నప్ప్పుడు ఎక్కువగా వచ్చే Whatsapp నోటిఫికేషన్ల నుండి ఈ ట్రిక్ తో తప్పించుకోవచ్చు. మరి ఈ ట్రిక్ ను ఎలా చెయ్యాలో చూద్దామా.

నెట్ ఆఫ్ చెయ్యకుండా Whatsapp ఆఫ్ చెయ్యడానికి గూగుల్ ప్లే స్టోర్ నుండి Pause It App డౌన్ లోడ్ చేసి ఉపయోగించ వలసి వుంటుంది. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో 4 స్టార్ రేటింగ్ తో వుంది. అయితే, తర్డ్ పార్టీ యాప్ ని ఉపయోగించడం సేఫ్ అని నమ్మిన తరువాత మాత్రమే ఈ విధంగా చేయండి. ఈ యాప్ తో మీ ఫోన్ ఇంటర్నెట్ ను ఆఫ్ చెయ్యకుండానే మీ వాట్స్ఆప్ ను ఆఫ్ చెయ్యవచ్చు.

దీనికోసం మీరు మీరుచేయవల్సిందల్లా యాప్ డౌన్ లోడ్ చేసుకొని ఇన్ స్టాల్ చేయ్యడమే. తరువాత, యాప్ లో Active Apps పైన ఉన్న టోగుల్ బటన్ ని నొక్కితే చాలు మీకు కావాల్సిన యాప్స్ డేటా ఆఫ్ అవుతుంది. అంతేకాదు,  మీరు ఎంత సమయం మీ వాట్స్ఆప్ ని ఆఫ్ చేయాలనుకుంటారో అంత టైం ను కూడా సెట్ చేసుకోవచ్చు.

డేటా ఖర్చు చేయకుండా వాట్స్ఆప్ ఉపయోగించాలి అంటే కూడా ఒక ట్రిక్ వుంది.

ఈ విధంగా చేస్తే మీరు వాట్సాప్‌ లో డేటా వినియోగాన్ని తగ్గించవచ్చు

మొదట వాట్సాప్ తెరిచి, పైన ఉన్న మూడు నిలువు చుక్కలపై నొక్కండి.

ఇప్పుడు సెట్టింగులకు వెళ్లి డేటా మరియు స్టోరేజ్ ఎంపికను ఎంచుకోండి.

ఇక్కడ ఇచ్చిన తక్కువ డేటా వాడకంలో, మీరు కాల్ ఇన్ డేటాను తగ్గించుకునే ఎంపికను పొందుతారు, దాని ప్రక్కన ఇచ్చిన టోగిల్‌ను ఆన్ చేయండి.

అదేవిధంగా, మీరు వాట్సాప్‌లోని ఫోటోలు మరియు వీడియోల నుండి డేటా వినియోగాన్ని కూడా నిరోధించవచ్చు.

దీని కోసం మీరు మళ్ళీ సెట్టింగులకు వెళ్ళాలి.

ఇప్పుడు మీరు డేటా మరియు స్టోరేజి వినియోగంపై క్లిక్ చేయాలి.

ఇప్పుడు మొబైల్ డేటా ఎంపికను ఉపయోగించి లోపలికి వెళ్లి అన్ని పెట్టెల పక్కన ఎంపికను తీసివేయండి.

అదేవిధంగా Wi-Fi లో కనెక్ట్ అయినప్పుడు మరియు రోమింగ్ చేసేటప్పుడు రెండు ఇతర ఎంపికలలో ఒకే విధానాన్ని పునరావృతం చేయండి. 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :