government bans over 20 ott apps in india
Big News: దేశంలో అతిపెద్ద రంగమైన ఎంటర్టైన్మెంట్ రంగానికి ఇప్పుడు పెద్ద షాక్ ఇచ్చింది భారత ప్రభుత్వం. అయితే, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని చాలామంది నిపుణులు చెబుతున్నారు. అదేమిటంటే, దేశంలో 20 కి పైగా ఓటీటీ యాప్స్ ను బ్యాన్ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన తీసుకోవడానికి వెనుక చాలా బలమైన కారణాలు ఉన్నట్టు కూడా తెలియజేశారు. ప్రభుత్వం బ్యాన్ విధించిన యాప్స్ మరియు బ్యాన్ విధించడానికి దారి తీసిన కారణాలు గురించి వివరంగా తెలుసుకోండి.
ఎటువంటి కథ లేదా సరైన వివరణ లేకుండా కేవలం అసభ్య వీడియోలతో కూడిన వెబ్ సిరీస్ లను మాత్రమే ఎక్కువ ప్రసారం చేస్తున్న యాప్స్ గూర్చిన ప్రభుత్వం, వీటిపై బ్యాన్ విధించింది. భారతదేశం అమలు చేస్తున్న చట్టాల్లో ఉన్న పలు చట్టాలు ఈ యాప్స్ ఉల్లంఘించినట్లు గుర్తించిన సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గూగుల్ ప్లే స్టోర్ మరియు యాపిల్ యాప్ స్టోర్ నుంచి కూడా ఈ యాప్స్ ను పూర్తిగా తొలగించినట్లు ప్రభుత్వం తెలిపింది.
ఎంటర్టైన్మెంట్ పేరుతో అసభ్య వీడియోలతో కూడిన సిరీస్ లను అతిగా ప్రసారం చేయడమే ఈ యాప్స్ బ్యాన్ అవ్వడానికి దారి తీసిన ప్రధాన కారణం. ఈ యాప్స్ ను బ్యాన్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ (MHA), మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ (MWCD), మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY), డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ అఫైర్స్, ఇండస్ట్రీ అసోసియేషన్స్ (FICCI, CII) మరియు ఉమెన్ అండ్ చైల్డ్ రైట్స్ నిపుణులు సంయుక్తంగా ఈ చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు.
Also Read: LG 55 ఇంచ్ Smart Tv పై ఈరోజు రూ. 5,000 భారీ డిస్కౌంట్ అందుకోండి.!
ప్రభుత్వం బ్యాన్ చేసిన యాప్స్ లో ALTBalaji (ALTT), ఉల్లు, మొజ్ ఫిక్స్, దేశిఫ్లిక్స్, బూమెక్స్,మూడ్ ఎక్స్, నియాన్ ఎక్స్ విఐపి, నవరస లైట్, ఫెనెవ్, గులాబ్ యాప్, అడ్డా టీవీ, షో ఎక్స్ వంటి మరిన్ని యాప్స్ ఉన్నాయి. యువత పెడదారి పట్టకుండా మరియు పిల్లలు అసభ్య సీన్స్ ఉండే షోలకు దూరంగా ఉంచడానికి ఈ బ్యాన్ సహకరిస్తుందని నిపుణులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.