Whatsapp లో మరొక కొత్త ఫీచర్, ఇక డేట్ ప్రకారం Messege చెక్ చెయ్యవచ్చు

Whatsapp లో మరొక కొత్త ఫీచర్, ఇక డేట్ ప్రకారం Messege చెక్ చెయ్యవచ్చు
HIGHLIGHTS

Whatsapp తన వినియోగదారులకు ఒక మంచి ఫీచరును తీసుకొస్తోంది

ఇప్పుడు కావాల్సిన మెసేజీని చెక్ చెయ్యడం కోసం Whatsapp Date Search ‌లో తేదీ ద్వారా సెర్చ్ చేయ్యవచ్చు.

Whatsapp తన వినియోగదారులకు ఒక మంచి ఫీచరును తీసుకొస్తోంది మరియు ఇది వినియోగదారులకు వారి మెసేజిలను వారికీ కావాల్సిన తేదీ అనుసారంగా సెర్చ్ చేసే వీలుంటుంది. అంటే, మీరు ఇప్పుడు మీ కావాల్సిన మెసేజీని చెక్ చెయ్యడం కోసం Whatsapp Search By Date ‌లో తేదీ ద్వారా సెర్చ్ చేయ్యవచ్చు. ఈ Date Search ఫీచర్‌పై పనిచేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది, వినియోగదారుల వారికీ కావాల్సిన నిర్దిష్ట మెసేజిల కోసం సెర్చ్ చేయడం  చాలా సులభం అవుతుంది.

 ఈ నివేదిక మొదటగా WABetaInfo ద్వారా నివేదించబడినది. అయితే, ప్రస్తుతానికి ఈ Whatsapp Search By Date లక్షణం ఇప్పటికీ Alfa స్టేజిలో ఉంది మరియు ఈ ఫీచర్ లాంచ్ తేదీ కూడా ప్రకటించలేదు. ప్రస్తుతం, మీరు మీ చాట్ బాక్స్‌లో ప్రత్యేకమైన కంటెంట్ కోసం సెర్చ్ చేయవచ్చు, కానీ రానున్న క్రొత్త ఫీచర్‌తో, సందేశాల కోసం వెతకడం మరింత సులభం చేయడానికి కంపెనీ ప్రయత్నిస్తోంది.

ఈ Whatsapp Search By Date ఫీచర్ క్యాలెండర్ చిహ్నంతో వస్తుంది, ఇది మెసేజ్ పంపినప్పుడు నిర్దిష్ట తేదీని ఎంచుకోవడానికి వినియోగదారులకు సహాయపడుతుంది. ఈ ఫీచర్,  Android మరియు iOS రెండింటిలోనూ అందుబాటులో ఉండనుంది. ఈ అధునాతన సెర్చ్ ఫీచర్ కార్యాలయాలకు సహాయపడుతుంది మరియు వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కమ్యూనికేట్ చేసే అవకాశాన్ని ఇస్తుంది. వాస్తవానికి, త్వరలో రాబోయే మరో ఫీచర్‌పై కూడా కంపెనీ పనిచేస్తోంది. ఇంతకు ముందు నివేదించినట్లుగా, వాట్సాప్ మల్టి-డివైజ్ ఫీచర్ ను జోడించాలని చూస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo