Oneplus 3 కంప్లీట్ తెలుగు రివ్యూ

Oneplus 3 కంప్లీట్ తెలుగు రివ్యూ
OnePlus 3 Review Rating: 87/100

Price: Rs. 27,999

లాభాలు:

  • క్లాస్ పెర్ఫార్మన్స్
  • ప్రీమియం బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్
  • స్మూత్ stock ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్
  • సూపర్ డిస్ప్లే
  • సూపర్ ఫాస్ట్ చార్జింగ్
  • గుడ్ ఓవర్ ఆల్ కెమెరా పెర్ఫార్మన్స్

నష్టాలు:

  • బ్యాటరీ లైఫ్ – ఒక రోజే
  • వాటర్ resistance ఉండే బాగున్ను
  • SD కార్డ్ సపోర్ట్ లేదు, 64GB ఇంబిల్ట్ మాత్రమే

ఫైనల్ లైన్: 
అన్నీ కన్సిడర్ చేస్తే..రెండు రోజుల బ్యాటరీ లైఫ్, SD కార్డ్ సపోర్ట్ అండ్ వాటర్ resistance అనే requirements, ఫ్లాగ్ షిప్ ఫోనులో ఉండాలి కదా అని మీకు అనిపించకపోతే Oneplus 3 ను కచ్చితంగా తీసుకోవచ్చు. Xiaomi Mi 5(24,999 రూ) అండ్ Le Max 2 (29,999 రూ) ఫోనుల కన్నా బెటర్ value, overall ప్రీమియం ఎక్స్పిరియాన్స్ ఉన్నాయి oneplus 3 లో. సామ్సంగ్ గేలక్సీ S7, LG G5, HTC 10 లతో పోలిస్తే ఇంకా బెటర్ value for money oneplus 3. త్వరలో రిలీజ్ కానున్న ఆసుస్ జెన్ ఫోన్ 3 మరియు Moto Z ఈ రెండు ఫోనులే oneplus 3 కు కొంచెం పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి. impressive స్పెక్స్ తో రానున్నాయి ఇవి. సో ఫైనల్ గా మీరు ఫ్లాగ్ షిప్ ఫోన్ కొనే ప్లాన్స్ లో ఉంటే ప్రస్తుతం, oneplus 3 highly recommended.

క్విక్ స్పెక్స్ :5.5" 1080p AMOLED display, Qualcomm స్నాప్ డ్రాగన్ 820 SoC, 6GB RAM, 64GB storage, 16MP rear camera with OIS and PDAF, 8MP front camera, Android Marshmallow v6.0.1-based Oxygen OS, Front fingerprint sensor, 3000mAh battery with Quick Charge (Dash Charge), Metal Unibody design, Dual SIM 4G, Corning Gorilla Glass 4 protection, NFC-enabled, USB Type C, weighs 158g, measure 7.35mm in thickness, Notification LED.

Oneplus 3 కంప్లీట్ రివ్యూ – బిల్డ్ అండ్ డిజైన్: ఫుల్ మెటల్ బాడీ బాగుంది
158 గ్రా బరువు..ఫర్వాలేదు. స్లిమ్ గా ఉంది. అల్యూమినియం alloy based unibody మెటాలిక్ బాడీ edges లో కంఫర్ట్ గా ఉండేందుకు curves తో ఉంది. డిజైన్ పరంగా HTC ప్రివియస్ ఫ్లాగ్ షిప్ ఫోనుల వలె ఉంది. కాని ఇది మంచి లుక్స్ తో వస్తుంది. ఫ్రంట్ లో గ్లాస్ బాడీ ఉంటుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫ్రంట్ సైడ్ ఉంది క్రింద. ఫ్రంట్ డిస్ప్లే సైడ్స్ చాలా చిన్నగా ఉన్నాయి. వీటినే బెజేల్స్ అంటారు. ఇవి ఎంత చిన్నగా ఉంటే అంత తక్కువ వైడ్ గా ఉంటుంది ఫోన్. అంటే తక్కువ వైడ్ ఉన్న ఫోన్ చేతిలో ఉన్నపుడు వాడటానికి కంఫర్ట్ గా ఉంటుంది. ముఖ్యంగా సింగిల్ హ్యాండ్ టైపింగ్ కు. ఈ ఫోన్ వీలైనంత మినిమల్ బెజేల్స్ తో వచ్చింది. ఓవర్ ఆల్ గా గ్రౌండ్ బ్రేకింగ్ డిజైన్ లేదా కొత్తగా లేకపోయినా క్లాసీ, tasteful అండ్ ప్రీమియం గా ఉంది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

The front of the OnePlus 3 does little to excite a flagship smartphone buyer in terms of design


The Alert Slider puts you in control of how you like your notifications to be served

ఇక ఫోన్ వాడుతున్నప్పుడు ఉండే సౌలభ్యం గురించి చెప్పాలంటే.. బాగుంది నిజంగా. 5.5 in స్క్రీన్ అండ్ ఫుల్ మెటల్ బాడీ ఉన్న ఫోన్ లలో oneplus 3 లైట్ అండ్ కాంపాక్ట్ గా ఉంది. స్లిమ్ గా ఉండటం వలన ఈజీగా మేనేజ్ చేయగలరు కూడా ప్రివియస్ oneplus ఫోన్లతో పోలిస్తే. వెనుక అల్ట్రా స్మూత్ గా ఉంది. సో చేతిలో నుండి జారే అవకాశాలున్నాయి. వెనుక కెమెరా లెన్స్ కూడా ఫోన్ బాడీ లోపలకు లేవు, బయటకు వచ్చింది లెన్స్ బాడీ. సో లెన్స్ స్క్రాచ్ అయ్యే అవకాశాలున్నాయి. అయితే లెన్స్ గ్లాస్ minor scratches ను తట్టుకోగలవు. కాని ఎలాగైనా లాంగ్ టర్మ్ usage లో స్క్రాచ్ అవుతాయి. USB టైప్ C పోర్ట్ ఫోన్ bottom ఏరియా లో ఉంది అన్ని ఫోన్ల వలె. స్పీకర్ మాత్రం సింగిల్ grille తో వస్తుంది.దాని పక్కనే 3.5mm ఆడియో జాక్ కూడా ఉంది. ఫోన్ లెఫ్ట్ సైడ్ alert slider తో పాటు వాల్యూం బటన్స్ ఉన్నాయి. రైట్ లో సిమ్ tray అండ్ పవర్ బటన్.


Premium finish and high quality sand blasting seperates the OnePlus 3 from many unibody smartphones that lack such finesse

డిస్ప్లే: బాగుంది
పవర్ సేవింగ్ లో అమోలేడ్ డిస్ప్లే లు బాగా పనిచేస్తాయి. కాంట్రాస్ట్ అండ్ బ్లాక్ లెవెల్స్ కూడా బాగా ఇస్తాయి. కానీ చాలా వరకు oversaturated అవుతాయి అలాగే కలర్ cast issues కూడా ఉంటాయి అమోలేడ్ డిస్ప్లే panels లో. కాని thankfully 1080P 5.5 in Amoled డిస్ప్లే బాగుంది oneplus 3 లో.బాలన్స్ కలర్స్, మినిమల్ ఓవర్ saturation, మంచి వ్యూయింగ్ angles ఉన్నాయి. వీటితో పాటు పవర్ efficiency మరియు కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా నిజంగా oneplus 3 ను స్మార్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ అనిపించాయి. బ్యాటరీ కూడా 3000 mah బేసిక్ కెపాసిటీ అవటం వలన డిస్ప్లే , బ్యాటరీ ను సేవ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. డిస్ప్లే బ్రైట్ గా ఉంది. సన్ లైట్ లో కూడా బ్రైట్ గా ఉంది. slight గా warm గా ఉంది. అయితే వీటిని మార్చుకోగలరు డిస్ప్లే సెట్టింగ్స్ లో slider ద్వారా. గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్ కూడా ఉంది. మీకు బాక్స్ లో ఆల్రెడీ high క్వాలిటీ స్క్రీన్ protector వేయబడి ఉంటుంది ఫోన్ స్క్రీన్ పై. 


Left to Right: Samsung Galaxy S7, OnePlus 3, Apple iPhone 6s & LG G5. All set at maximum brightness, placed under bright day light.

Rich colours with just the right amount of contrast and 'pop', unfazed by the bright outdoor lighting

Looks like an HTC. Thankfully, not priced like one.

The 16MP camera dominates the back, doesn't sit flush with the body, and sticks out quite a bit.

This shot is here just because it looks good. What could we possibly want to show here? The balance? Perhaps.

పెర్ఫార్మన్స్: అల్టిమేట్
6GB ర్యామ్ ఫోన్! వినటానికే చాలా exciting ఉంది. దానికి తోడూ స్నాప్ డ్రాగన్ లేటెస్ట్ 820 SoC అండ్ ప్లస్ స్టాక్ ఒరిజినల్ ఆండ్రాయిడ్ UI. సో ఇంక పెర్ఫార్మెన్స్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు.  ర్యామ్ memory పరంగా ఎప్పుడూ వర్రీ అవసరం లేదు. ఏ పని అయినా ఈజీగా చేస్తుంది. యాపిల్ ఐ ఫోన్ 6S లో 2GB ర్యామ్ ఉంది 🙂 డిఫరెన్స్ ఎంత ఉందొ చూడండి. అయితే ఇది high end స్పెక్. అంటే costly insurance పాలిసీ లాంటిది. ఎందుకంటే insurance లానే ఫుల్ 6GB ర్యామ్ ను మీరు full fledged గా ఎప్పుడూ వాడలేరు. అయినప్పటికీ ప్లస్ పాయింట్ అనే అనుకోవాలి.

బెంచ్ మార్క్స్ దగ్గరకు వస్తే ఇవి రియల్ వరల్డ్ కు దగ్గరిగా ఉన్నాయి. 820 SoC కూల్ గా, నిలకడిగా  ఫాస్ట్ ప్రొసెసర్. అయితే మీరు ఉన్న ప్రదేశంలో వాతారణం వేడిగా ఉన్నా హెవీ లోడింగ్ ఉన్న పనులు చేసినా ఫోన్ అప్పుడప్పుడు warm అవుతుంది. ఒక సారి warm అవటం మొదలుపెడితే ఫుల్ మెటల్ బాడీ అవటం వలన ఫోన్ టోటల్ గా క్విక్ గా వేడి అవుతుంది. అయితే ఇది హెవీ లోడింగ్ ఉంటేనే! oneplus 3 ఈ విషయంలో మా torture టెస్ట్ లో గెలిచింది. 40 నిముషాలు హెవీ గేమింగ్, 10 మినిట్స్ 4K వీడియో షూటింగ్ చేసినా వేడి ఎక్కటం వంటివి జరగలేదు ఫోన్ లో.

ఫింగర్ ప్రింట్ స్కానర్ ceramic ఫినిషింగ్ తో వస్తుంది. 0.3 సేకేండ్స్ లో ఆఫ్ లో ఉన్న స్క్రీన్ ను ఆన్ చేయగలరు ఫింగర్ ప్రింట్ తో. ఇతర ఫ్లాగ్ షిప్ ఫోనులన్నిటి కన్నా ఇది ఫాస్ట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తుంది అని చెప్పాలి. అయితే ఫింగర్ ప్రింట్ లో కింగ్ గా ఉన్న Nexus imprint కన్నా ఫాస్ట్ కాదు. క్రింద బెంచ్ మార్క్స్ చూడగలరు.

బ్యాటరీ: ఎవరేజ్ లైఫ్ కాని సూపర్ ఫాస్ట్ చార్జింగ్
3000 mah బ్యాటరీ ఒకటే ఫోన్ లో ఎవరైనా ఫీల్ అయ్యే మైనస్. రెగ్యులర్ నుండి moderate usage లో ఫోన్ ఒక రోజు వస్తుంది. హెవీ users కు  day సగంలోనే అయిపోతుంది. అయితే ఇక్కడ ఉన్న మంచి విషయం ఏంటంటే చాలా ఫాస్ట్ గా చార్జింగ్ ఎక్కుతుంది ఫోన్. కొత్తగా Dash చార్జింగ్ టెక్నాలజీ జోడించింది ఫోన్ లో. ఇది 30 నిమిషాల్లో 60 శాతం చార్జ్ అవుతుంది టెక్నికల్ కెపాసిటీ లెక్కల ప్రకారం. నిజంగా దాదాపు చెప్పినట్టు గానే అవుతుంది కూడా. 1% నుండి 60% కు వెళ్ళటానికి 30 మినిట్స్ 23 సేకేండ్స్ పట్టింది. అయినా బ్యాటరీ మాత్రం ఎవరేజ్ లైఫ్ ఇస్తుంది అని చెప్పాలి.

కెమెరా: enhancement ఎక్కువుగా ఉంది.
16MP సోనీ IMX298 సెన్సొర్ PDAF అండ్ OIS తో impressive గా ఉంది day టైమ్ లో. చాలా ఎక్కువ డిటేల్స్ ఇస్తుంది సరైన ఫోకస్ తో. కెమెరా లెన్స్ కు ఫోకస్ lock చేయటానికి కావలసినంత లైటింగ్ ఉంటె కెమెరా రెస్పాన్స్ కూడా చాలా బాగుంది.  కానీ Low లైటింగ్ లో సామ్సంగ్ , LG వంటి ఫ్లాగ్ షిప్ ఫోనులంత క్వాలిటీ ఇవటం లేదు. సాఫ్ట్ వేర్ తో హార్డ్ వేర్ లోని weakness(సోనీ సెన్సార్ లో ఉండే మైనస్ విషయాలు) ను కవర్ చేయటానికి ట్రై చేసింది oneplus. సక్సెస్ అయ్యింది కూడా optimise చేసి. ఫర్ eg HD మోడ్ డిటేల్స్ మరియు షార్ప్ నెస్ ను పెంచుతుంది. మేము చాలా వరకూ ఫోన్ లో by default గా వస్తున్న soft ఇమేజెస్ ను avoid చేయటానికి HD mode ను ఎక్కువ వాడటం జరిగింది. OIS విషయానికి వస్తే అంత huge డిఫరెన్స్ కనపడటం లేదు. ఆటో mode లో నాయిస్ ఎక్కువ ఉంటే HD mode use అవుతుంది. ఓవర్ ఆల్ గా ఫోన్ లోని 16MP ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ most buyers కు నచ్చుతుంది. ప్రొఫెషనల్ ఫోటో గ్రఫీ ప్రేమికులకు మరియు demanding పవర్ users కు కూడా manual mode లో మంచి ఫోటోస్ ను ఇచ్చే విధంగా కెమెరా సెన్సార్ ను optimise చేసింది oneplus 3.

ఫ్రంట్ కెమెరా
కలర్స్ అండ్ డిటేల్స్ acceptable గానే ఉన్నాయి. ఎవరేజ్ సన్ లైట్ లో బాగా ఫోటోస్ తీస్తుంది. Low లైట్ లో నాయిస్ తక్కువ ఇస్తుంది. సో డిటేల్స్ అండ్ dynamic range లైటింగ్ తక్కువ ఉన్నా బాగున్నాయి. కానీ కొన్ని నైట్ షాట్స్ లో నాయిస్ కనిపిస్తుంది. క్రింద samples చూడగలరు.

 

 

Good capture in terms of colors and white balance, though a tad softer on details

Accurate colours and acceptable detail levels, does well to capture the variations on account of the soft sunlight 

In low light, the OnePlus 3 switches sides, sacrifices noise in favour of more details and dynamic range (and that is a good thing)

In this low light shot, the One Plus 3 preserves detail and highlights, at the cost of having to live with more noise.

Left to right: Samsung Galaxy S7, OnePlus 3, Apple iPhone 6s 

Left to Right: The Samsung Galaxy S7, OnePlus 3, Apple iPhone 6s.
Galaxy S7 bright గా ఉంది, OnePlus 3 మరియు iPhone 6s sharper images more details ఇస్తున్నాయి. OnePlus 3 కు superior contrast మరియు dynamic range ఉన్నాయి Samsung Galaxy S7 కన్నా.

OnePlus 3

Click the image above to check the entire image gallery

సాఫ్ట్ వేర్: ఒరిజినల్ ఆండ్రాయిడ్ లుక్స్ తో ఉంటుంది.
Oxygen OS లో UI అంతా ఒరిజినల్ ఆండ్రాయిడ్ UI లానే ఉండటం వలన ఫ్లాగ షిప్ ఫోన్ లో stock UI తో వస్తున్న ఫోన్ ఇదే అని చెప్పాలి. ఇది ఫాస్ట్ గా ఉంటుంది ఎటువంటి మెరుగులు, అందాలూ లేకపోవటం వలన. అదే MIUI, Meizu etc వంటి custom UI లలో అయితే ఎక్కువ ఫంక్షన్స్ , ఎక్కువ theming ఉంటుంది. సో స్పీడ్ compromise అవుతుంది. హోమ్ స్క్రీన్ లో రైట్ కు స్వైప్ చేస్తే Shelf స్క్రీన్ ఉంటుంది. ఇక్కడ ఏదైనా రిమైండర్, notes etc ఉంటాయి. ఇవి అదనంగా వస్తున్నావే OS తో. కాని useful నా అభిప్రాయం లో. night mode కూడా ఉంది. బ్యాటరీ మరియు eye strain ను సేవ్ చేస్తుంది. మేము వాడుతున్నప్పుడైతే ఒక్కసారి కూడా యాప్ క్రాష్ అండ్ ఇతర బగ్స్ వంటివి లేవు. గతంలో oneplus 2 లో చాలా ప్రాబ్లెమ్స్ ఉండేవి UI లో. సో అన్నీ బాగా సాల్వ్ అయ్యాయి అని చెప్పవచ్చు.

కాల్ క్వాలిటి, ఆడియో output అండ్ కనెక్టివిటీ: అన్ని బాగున్నాయి
కాల్ క్వాలిటి గుడ్ నుండి excellent మధ్యలో ఉంటుంది.  సిగ్నల్ సరిగ్గా ఉండని రెండు ఏరియాలలో కూడా బాగా ట్రాన్స్ ఫర్ అయ్యింది కాల్ ఆడియో. 4G ఎయిర్టెల్ లో ఇంటర్నెట్ టెస్ట్ చేస్తే ఆపిల్ 6S లో 3 సిగ్నల్ బార్స్ తో
2.64Mbps download speeds అండ్ 0.45Mbps  upload speeds ఉండగా  oneplus 3 లో 3.68Mbps download అండ్ 1.44Mbps అప్ లోడ్ స్పీడ్స్ వచ్చాయి. ఆడియో విషయానికి వస్తే సౌండ్ హెడ్ ఫోన్ జాక్ లో అన్నీ ఆండ్రాయిడ్ ఫ్లాగ్ షిప్ ఫోనుల వలె బాగుంది. లౌడ్ స్పీకర్ లో మాత్రం లౌడ్ గా ఉంది. సింగల్ mono స్పీకర్ అయినా మంచి రేంజ్ లో ఉంది సౌండ్. స్పీకర్ లో సౌండ్ treble ఎక్కువ ఇస్తుంది. సో ఎక్కువ సేపు వింటే కొంచెం ఇబ్బంది అనిపించవచ్చ్చు. కాని లౌడ్ నెస్ బాగుంది.

సో ఫైనల్ గా Oneplus మూడవ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ Oneplus 3 ను తీసుకోవచ్చా?
అన్నీ కన్సిడర్ చేస్తే..రెండు రోజుల బ్యాటరీ లైఫ్, SD కార్డ్ సపోర్ట్ అండ్ వాటర్ resistance అనే
requirements, ఫ్లాగ్ షిప్ ఫోనులో ఉండాలి కదా అని మీకు అనిపించకపోతే Oneplus 3 ను కచ్చితంగా తీసుకోవచ్చు. Xiaomi Mi 5(24,999 రూ) అండ్ Le Max 2 (29,999 రూ) ఫోనుల కన్నా బెటర్ value, overall ప్రీమియం ఎక్స్పిరియాన్స్ ఉన్నాయి oneplus 3 లో. సామ్సంగ్ గేలక్సీ S7, LG G5, HTC 10 లతో పోలిస్తే ఇంకా బెటర్ value for money oneplus 3. త్వరలో రిలీజ్ కానున్న ఆసుస్ జెన్ ఫోన్ 3 మరియు Moto Z ఈ రెండు ఫోనులే oneplus 3 కు కొంచెం పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి. impressive స్పెక్స్ తో రానున్నాయి ఇవి. సో ఫైనల్ గా మీరు ఫ్లాగ్ షిప్ ఫోన్ కొనే ప్లాన్స్ లో ఉంటే ప్రస్తుతం, oneplus 3 highly recommended.

Soham Raninga

Soham Raninga

Soham Raninga is the Chief Editor for Digit.in. A proponent of performance > features. Soham's tryst with tech started way back in Dec 1997, when he almost destroyed his computer, trying to make the Quake II demo run at >30FPS View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo