3G ఫోనుల్లో Jio 4G సిమ్ పనిచేస్తుంది. క్రింద తెలిపిన steps ఫాలో అవ్వండి!

3G ఫోనుల్లో Jio 4G సిమ్ పనిచేస్తుంది. క్రింద తెలిపిన steps ఫాలో అవ్వండి!

UPDATE: Jio సర్వర్స్ లోని మార్పులు వలన చాలా రోజుల క్రితం క్రింద తెలిపిన ప్రోసెస్ గతంలో పనిచేసినప్పటికీ ప్రస్తుతం ఎక్కువ శాతం కస్టమర్స్ కు పనిచేయటం లేదు. సో అయినా సరే ఒక సారి టెస్ట్ చేసి చూద్దాం అనుకునే వారు టెస్ట్ చేయవచ్చు.

కాని టెక్నికల్ గా 3G/2G ఫోనుల్లో Jio 4G సిమ్ వేసి సర్వీసెస్ ను వాడటం అనేది కుదరదు. కాని 3G/2G ఫోనుల్లో Jio సర్వీసెస్ కావాలనుకుంటే ఈ లింక్ లో ఉన్న మెథడ్ చూడగలరు. ఇంతకుమించి మరేవిధంగా మీరు 2G/3G ఫోనుల్లో Jio వాడటానికి కుదరదు.

 

ఇంతకముందు వ్రాస్సిన ఆర్టికల్:

3G ఫోను పై రిలయన్స్ Jio ను పనిచేసేలా చేయవచ్చని గతంలో లైవ్ వీడియో లో తెలపటం జరిగింది. క్రింద ఇది ఏలా సాధ్యం అవుతుంది అనేది తెలుసుకుందాము రండి!

ప్రాసెస్ మొదలు పెట్టె ముందు తెలుసుకోవలసిన విషయాలు…

  • మీరు క్రింద ప్రోసస్ చేసిన తరువాత Jio 4G సిమ్ ను 3G ఫోన్ లో పెడితే సక్సెస్ ఫుల్ గా సిగ్నల్స్ చూస్తారు. కాని అది 4G కాదు. 3G మాత్రమే! ఇంటర్నెట్ డౌన్లోడ్ స్పీడ్ అనేది 3G స్పీడ్స్ తోనే వస్తుంది. unlimited అండ్ ఫ్రీ కాబట్టి 3G అయినా ఫర్వాలేదు!
  • ఇది అఫీషియల్ ప్రాసెస్ కాదు. కంపెని అఫీషియల్ గా 3G ఫోన్లపై Jio సపోర్ట్ ను ప్రస్తుతానికి అయితే అందించటం లేదు.  మరియు క్రింది ప్రాసెస్ ఆండ్రాయిడ్ ఫోనులపైనే పనిచేస్తుంది ప్రస్తుతానికి
  • మొదలు పెట్టె ముందు మీరు Jio సిమ్ ను తీసుకోని యాక్టివేట్ చేసుకొని రెడీ గా ఉండాలి. ఏలా తీసుకోవాలి సిమ్ అని తెలుసుకోవటానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.
  • టోటల్ రెండు మెథడ్స్. ముందు ఫర్స్ట్ మెథడ్ ట్రై చేయండి. పనిచేయకపోతే. రెండవ మెథడ్ ట్రై చేయగలరు.

 

First Method (సింపుల్ మెథడ్) –

ముందుగా సింపుల్ మెథడ్ ఒకటి ఉంది. ఇది ఆల్రెడీ MOTOROLA MOTO G అండ్ MOTO E మొదటి జనరేషన్ ఫోన్లపై సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసినట్లు రిపోర్ట్స్ ఉన్నాయి.

  • ఫోన్ లో కాల్స్ చేసే dailer ఓపెన్ చేసి *#*#4636#*#* ను ఎంటర్ చేసి డైల్ చేయండి.
  • ఇప్పుడు మీకు Testing మెను కనిపిస్తుంది. ఈ మెనూ లో మొదటిగా Phone Information ఉంటుంది. దానిపై టాప్ చేయండి.
  • ఇప్పడు కొత్త స్క్రీన్ వస్తుంది ఫోన్ పై. దానిని క్రిందకు స్క్రోల్ చేస్తే Set Preferred Network Type పేరుతో ఒక డ్రాప్ డౌన్ మెనూ ఉంటుంది. దాని పై క్లిక్ చేయగానే  ఒక లిస్టు వస్తుంది.
  • ఆ లిస్టు లో  LTE/GSM auto(PRL) అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసిబ్యాక్ కు వెళ్ళిపోయి ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేయండి.
  • ఇప్పుడు Jio సిమ్ ను మొదటి స్లాట్ లో పెట్టి(రెండవ స్లాట్ లో మరో సిమ్ పెట్టకండి), ఫోన్ ఆన్ చేస్తే మీకు Jio సిమ్ సిగ్నల్స్ చూపిస్తుంది 3G ఫోన్ లో.

 

Second Method( పైన చెప్పినది పనిచేయకపోతే ) –  క్రింద మీరు ట్రై చేయబోయే రెండవ ప్రాసెస్, మీ ఫోనులోని ప్రొసెసర్/చిప్ సెట్/SoC ( Qualcomm snap dragon మరియు Mediatek ) బట్టి ఉంటుంది. 

అసలు మా ఫోన్లో మీడియా టెక్ SoC(చిప్ సెట్, ప్రాసెసర్) ఉందా Qualcomm ఉందా అని తెలుసు కోవాలి?
ఈ లింక్ నుండి ప్లే స్టోర్ లో ఉన్న CPU -Z యాప్ ను డౌన్లోడ్ చేసి ఇంస్టాల్ చేసుకోండి. యాప్ మీ ఫోన్ యొక్క ఇన్ఫర్మేషన్ ను తెలుసుకుని మీకు చూపించటం జరుగుతుంది. ఇప్పుడు మీకు స్క్రీన్ పై Mediatek ప్రొసెసర్ అయితే మీడియా టెక్ లోగో/సింబల్ చూపిస్తుంది లేదంటే Qualcomm స్నాప్ డ్రాగన్  లోగో చూపిస్తుంది.

Mediatek ప్రాసెసర్ కలిగిన 3G ఫోనుల్లో 4G సపోర్టింగ్ Jio సిమ్ పనిచేయటానికి ఇలా చేయండి…

  • ఈ లింక్ నుండి MTK Engineering Mode యాప్ ను డౌన్లోడ్ చేసి ఇంస్టాల్ చేయాలి మీ 3G ఫోనులో.
  • యాప్ ఓపెన్ చేసి MTK సెట్టింగ్స్ లోకి వెళ్లి preferred network option ను సెలెక్ట్ చేయండి.
  • ఇక్కడ మీకు 4G LTE/WCDMA/GSM అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని network mode గా సెలెక్ట్ చేసి సేవ్ చేసి ఫోన్ రిస్టార్ట్ చేయాలి.
  • ఇప్పుడు ఈ 3G ఫోన్ లో యాక్టివేట్ అయిన Jio సిమ్ ను మొదటి స్లాట్ లో  పెట్టాలి. సెకెండ్ స్లాట్ లో మాత్రం రెండవ సిమ్ ను పెట్టకూడదు. (అంతా పనిచేసిన తరువాత పెట్టి చూడండి.)
  • సో మీకు Jio సిగ్నల్స్ కనిపిస్తాయి. (కనపడని వారికీ ఒక మీ ఏరియా లో సిగ్నల్ లేదు అని అర్థం).
  • పనిచేయని వారు స్టెప్స్ అన్నీ క్లియర్ గా పర్ఫెక్ట్ చేశారో లేదో చూసుకోండి.

 

Qualcomm ప్రొసెసర్ కలిగిన 3G ఫోనుల్లో, Jio పనిచేయటానికి ఇలా చేయండి…

  •  ఈ లింక్ నుండి Shortcut Master (Lite) అనే యాప్ ను డౌన్లోడ్ & ఇంస్టాల్ చేసి ఓపెన్ చేయండి.
  • ఇప్పుడు vertical గా 3 డాట్స్ కనిపిస్తాయి టాప్ రైట్ కార్నర్ లో. దాని పై టాప్ చేసి Service Menu లేదా Engineering Mode అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేయండి.
  • ఇప్పుడు మరలా System App అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసి LTE Bands ను ఓపెన్ చేయాలి. ఇక్కడ Band 40 ను సెలెక్ట్ చేస్తే చాలు. Jio సిమ్ ను మొదటి స్లాట్ లో పెట్టి ఫోన్ రిస్టార్ట్ చేస్తే సిగ్నల్స్ వస్తాయి.
  • అయితే అందరికీ System App ఆప్షన్ కనిపించదు. సో కనిపించని వారు *#2263# అనే నంబర్ ను ఫోన్ డైల్ పాడ్ లో ఎంటర్ చేసి డైల్ చేసి Menu సెలెక్ట్ చేసి "Back" ఆప్షన్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు మరలా Menu కనిపిస్తుంది. దానిని సెలెక్ట్ చేయండి.
  • తరువాత "0000" (నాలుగు సున్నాలను) ఎంటర్ చేయాలి Key Input లోకి వెళ్లి.
  • కొన్ని సెకేండ్స్ తరువాత మీకు ఇప్పుడు PopUP వస్తుంది. దానిలో UE Settings సెలెక్ట్ చేస్తే setting అనే మరో ఆప్షన్ కనిపిస్తుంది. 
  • ఇక్కడ మీరు NAS->Network Control->Band Selection->LTE Band లోకి వెళ్తే కొన్ని bands కనిపిస్తాయి. వాటిలో Band 40 ను సెలెక్ట్ చేయాలి.
  • ఫోన్ లో మొదటి స్లాట్ లో Jio సిమ్ ను పెట్టి ఫోన్ రిస్టార్ట్ చేయండి. అంతే! యాక్టివేట్ అయిన సిమ్ యొక్క సిగ్నల్స్ కనిపిస్తాయి.

 

అంతా బాగానే ఉంది కాని మేము ఆల్రెడీ సిమ్ తీసుకున్నాము. చాలా రోజులైంది. కాని సిమ్ యాక్టివేట్ అవటం లేదు. ఏమి చేయాలి?
దీనికి త్వరలోనే ఒక సల్యుషణ్ అందిస్తాను.  Parallel గా మీరు ఆధార కార్డ్ తో మరో సారి సిమ్ తీసుకునే ప్రయత్నం చేయండి. సెప్టెంబర్ 5 నుండి సిమ్ ఏలా తీసుకోవాలో ఈ లింక్ లో తెలిపాను. స్టోరీ పై మీ కామెంట్స్ తెలియజేస్తే, మరిన్ని స్టోరీస్ వ్రాసేందుకు సహకరిస్తాయి.  Jio సిమ్ పై మీరు ఫేస్ బుక్ లో అడుగుతున్న కంప్లీట్ డౌట్స్ ను ఈ లింక్ లో క్లారిఫై చేయటం జరిగింది.

 

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo