AI నిజంగా డబ్బులు సంపాదించి పెడుతుందా .. లేక ఇదంతా ప్రచారమేనా.. అసలు నిజాలు తెలుసుకోండి.!

Highlights

గత కొన్ని నెలల నుంచి ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించే చర్చ జరుగుతోంది

AI ఉపయోగించి రోజుకు వేలకు వేలు సంపాదించవచ్చు, అని సోషల్ మీడియాలో అనేక వీడియోలు, ప్రకటనలు కనిపిస్తున్నాయి

వేల రూపాయలు కాదు ఇంట్లో కూర్చొని లక్షల రూపాయలు సంపాదించవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది

గత కొన్ని నెలల నుంచి ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించే చర్చ జరుగుతోంది. చదువు, ఉద్యోగం, వ్యాపారం, వైద్యం, ఇలా ప్రతి రంగంలోనూ AI వినియోగం పెరుగుతోంది. మరోవైపు AI ఉపయోగించి రోజుకు వేలకు వేలు సంపాదించవచ్చు, అని సోషల్ మీడియాలో అనేక వీడియోలు, ప్రకటనలు కనిపిస్తున్నాయి. వేల రూపాయలు కాదు ఇంట్లో కూర్చొని లక్షల రూపాయలు సంపాదించవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే, ఏఐ నిజంగానే డబ్బులు సంపాదించి పెడుతుందా? లేక ఇదంతా కేవలం మార్కెటింగ్ ప్రచారమా? అసలు నిజాలు తెలుసుకోండి.

AI తో నిజంగా ఆదాయం పొందవచ్చా?

ఈ మాటకు సమాధానం అవుననే చెబుతాము. నిజంగా AI ద్వారా ఆదాయం సంపాదించడం సాధ్యమే. కానీ, ఏఐ మనకు నేరుగా డబ్బులు ఇవ్వదని మీరు గమనించాలి. మనలో ఉన్న మరియు కొత్త నైపుణ్యాలను వేగంగా మరియు మెరుగ్గా ఉపయోగించుకోవడానికి ఏఐ సహాయపడుతుంది. ఇది సరైన మార్గాల్లో ఉపయోగిస్తే, ఇది మనకు ఆదాయం తెచ్చి పెడుతుంది.

ఉదాహరణకు ఒక కంటెంట్ రైటర్ Chat GPT సహాయంతో ఆర్టికల్స్ కోసం ఐడియాలు, హెడ్డింగ్స్ మరియు రీసెర్చ్ వివరాలు సిద్ధం చేసుకోవచ్చు. దీంతో తక్కువ సమయంలో ఎక్కువ పనిని పూర్తి చేయగలుగుతారు. దీని ద్వారా ఫ్రీ లాన్సింగ్ రేటింగ్ చేసే వారు తక్కువ సమయంలో ఎక్కువ ఆర్టికల్స్ అందించడం సాధ్యం అవుతుంది. అంటే, ఇది ఆదాయ మార్గంగా ఉంటుంది.

అలాగే, గ్రాఫిక్ డిజైనర్లు AI టూల్స్‌ తో పోస్టర్లు మరియు ఇమేజ్ లు రూపొందించవచ్చు. వీడియో క్రియేటర్లు కూడా AI సహాయంతో స్క్రిప్టులు, వాయిస్ ఓవర్లు మరియు వీడియో ఎడిటింగ్ పనులు చాలా సులభంగా చేసుకోవచ్చు. ఫ్రీలాన్సర్ లు ఈ సేవలను ఇతరులకు అందించి సులభంగా డబ్బులు సంపాదించవచ్చు.

సాధారణ వ్యక్తులు ఎలా సంపాదించవచ్చు?

AI ద్వారా ఆదాయం పొందడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అలాంటి మార్గాలతో సాధారణ వ్యక్తులకు ఉన్న ఆదాయ మార్గాలు ఏమిటో చూద్దాం.

కంటెంట్ రైటింగ్:

బ్లాగులు, వెబ్‌ సైట్ ఆర్టికల్స్ మరియు సోషల్ మీడియా పోస్టులు తయారు చేసి క్లయింట్లకు అందించవచ్చు.

యూట్యూబ్:

AI సహాయంతో వీడియో స్క్రిప్టులు, ఎడిటింగ్ మరియు థంబ్‌నెయిల్స్ తయారు చేయవచ్చు. మంచి కంటెంట్‌ తో యూట్యూబ్ ఛానల్ పైన ఆదాయం పొందవచ్చు. కొత్త ఛానల్ పెట్టడానికి కూడా ఇది మంచి ఆదాయ మార్గంగా ఉంటుంది.

గ్రాఫిక్ డిజైనింగ్:

వ్యాపారాలకు మరియు అవసరమైన ఆన్లైన్ కస్టమర్లకు లోగోలు, పోస్టర్లు మరియు ప్రకటనల డిజైన్లు రూపొందించవచ్చు.

ఆన్‌ లైన్ సర్వీస్:

చిన్న వ్యాపారాలకు డిజిటల్ మార్కెటింగ్, ప్రొడక్ట్ వివరణలు మరియు కస్టమర్ సపోర్ట్ సేవలు అందించవచ్చు.

AI తో డబ్బులు సంపాదించడం అంత సులభమా?

ఇక్కడే అసలు కీలకం దాగి ఉంది. AI టూల్స్ ఉపయోగించడం తెలిసినంత మాత్రాన ప్రతి ఒక్కరికీ ఆదాయం రాదు. వాటిని సరిగ్గా ఉపయోగించే నైపుణ్యం, కొత్త ఆలోచనలు, నాణ్యమైన పని మరియు కస్టమర్ల నమ్మకం మీకు అవసరం అవుతాయి. ఏఐ తయారు చేసిన సమాచారంలో తప్పులు ఉండొచ్చు. అందుకే, మీరు క్రియేట్ చేసిన వాటిని మీరే స్వయంగా పరిశీలించి, అవసరమైన మార్పులు కచ్చితంగా చేయాలి. అల్టిమేట్ గా మీ సొంత క్రియేటివిటీకి ఏఐ సహాయం జోడించి మీరు ఆదాయ మార్గాలు చూడాలి.

AI ఆదాయం పేరుతో మోసాలు కూడా ఉంటాయి జాగ్రత్త

రోజుకు రూ.5,000 నుంచి రూ.10,000 వరకు ఎలాంటి పని లేకుండా సంపాదించవచ్చని చెప్పే ప్రకటనలను మీరు నమ్మకండి. ముందుగా డబ్బులు చెల్లిస్తే AI ఉద్యోగం ఇస్తామని చెప్పేవారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత వివరాలు మరియు బ్యాంక్ సమాచారం తెలియని వెబ్‌ సైట్లలో ఇవ్వకూడదు.

చివరి మాట

AI తో డబ్బులు సంపాదించడం నిజమే. కానీ, కేవలం ఒక బటన్ నొక్కితే లక్షలు వచ్చిపడతాయనుకోవడం మాత్రం అపోహ. AI ని ఒక డబ్బులు ఇచ్చే చెట్టుగా కాకుండా మీ నైపుణ్యాలను పెంచే సాధనంగా ఉపయోగిస్తే మీరు మంచి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile