OnePlus 13R పై భారీ డిస్కౌంట్ మరియు ఉచిత బడ్స్ ఆఫర్ అందించిన అమెజాన్.!
ఈరోజు ముగియనున్న ప్రైమ్ డే సేల్ నుంచి భారీ డీల్స్ అందించింది
OnePlus 13R స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ ఇండియా బిగ్ డీల్స్
రీ డిస్కౌంట్ మరియు ఉచిత బడ్స్ ఆఫర్ ను అమెజాన్ అందించింది
OnePlus 13R స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ ఇండియా ఈరోజు ముగియనున్న ప్రైమ్ డే సేల్ నుంచి భారీ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ముగియనున్న ప్రైమ్ డే సేల్ నుంచి కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్ మరియు ఉచిత బడ్స్ ఆఫర్ ను అమెజాన్ అందించింది. అమెజాన్ అందించిన ఈ బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్ పై ఒక లుక్కేద్దామా.
SurveyOnePlus 13R : ఆఫర్
వన్ ప్లస్ 14 ఆర్ స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ ఇండియన్ మార్కెట్లో రూ. 42,999 ప్రైస్ తో లాంచ్ అయ్యింది. ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి రూ. 42,997 రూపాయల ప్రైస్ తో లిస్ట్ అయ్యింది. ఇందులో ఆఫర్ ఏముంది అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. ఈ ఫోన్ పై అమెజాన్ సేల్ నుంచి రూ. 3,000 రూపాయల డిస్కౌంట్ అందించే ICICI బ్యాంక్ కార్డ్స్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ ను రూ. 39,997 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు.

ఈ ఫోన్ పై మరో గొప్ప ఆఫర్ కూడా అందించింది. ఈ ఫోన్ ను అమెజాన్ సేల్ నుంచి కొనుగోలు చేసే యూజర్లకు రూ. 4,299 రూపాయల విలువైన OnePlus Buds 3 ఇయర్ బడ్స్ ఉచితంగా కూడా అందిస్తుంది. అంటే, ఈ ఫోన్ పై దాదాపు రూ. 7,299 రూపాయల లాభాలు యూజర్లు అందుకునేలా అవకాశం అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి అందించింది. ఈ మొబైల్ ఆఫర్ చేయడానికి Buy From Here పై నొక్కండి.
Also Read: Vivo X Fold 5 : అల్ట్రా స్లిమ్ డిజైన్ మరియు ZEISS కెమెరా సెటప్ తో లాంచ్ అయ్యింది.!
OnePlus 13R : ఫీచర్లు
వన్ ప్లస్ 13 ఆర్ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8 Gen 3 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు జతగా 12 జీబీ ర్యామ్ తో పాటు 256 జీబీ అంతర్గత స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.78 ఇంచ్ ProXDR LTPO 4.1 స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్1-120 Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉండటమే కాకుండా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ GG7i రక్షణ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో 50MP వైడ్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 50MP టెలిఫోటో కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. అలాగే, ముందు 16MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 2x ఆప్టికల్ జూమ్, 4X ఆప్టికల్ క్వాలిటీ జూమ్, AI కెమెరా ఫీచర్స్ మరియు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6,000 mAh బిగ్ బ్యాటరీ మరియు 80W సూపర్ ఊక్ అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.