Youtube New Rules: షాకింగ్ అప్ డేట్ విడుదల చేసిన యూట్యూబ్.!
యూట్యూబ్ సరికొత్త అప్డేట్ ను విడుదల చేసింది
ఇది అప్డేట్ అనుకోవచ్చు లేదా యూట్యూబర్స్ కోసం తెచ్చిన కొత్త రూల్స్ అని కూడా అనుకోవచ్చు
రూల్స్ మాత్రం కంటెంట్ క్రియేటర్స్ కి చెమటలు పట్టించే విధంగా ఉన్నాయి
Youtube New Rules : యూట్యూబ్ సరికొత్త అప్డేట్ ను విడుదల చేసింది. ఇది అప్డేట్ అనుకోవచ్చు లేదా యూట్యూబర్స్ కోసం తెచ్చిన కొత్త రూల్స్ అని కూడా అనుకోవచ్చు. మాట ఏదైతేనేమి కానీ తెచ్చిన రూల్స్ మాత్రం కంటెంట్ క్రియేటర్స్ కి చెమటలు పట్టించే విధంగా ఉన్నాయి. ఆఫ్ కోర్స్, రియల్ కంటెంట్ క్రియేటర్స్ కి ఎటువంటి సమస్య ఉండదనుకోండి. కేవలం ఎటువంటి శ్రమ లేకుండా ఇతరుల వీడియోలు లేదా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను నమ్ముకొని ఛానల్స్ నడుపుతున్న వారికి మాత్రమే ఇది గొడ్డలిపెట్టు అవుతుంది.
SurveyYoutube New Rules: ఏమిటా రూల్స్?
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరిగిన నాటి నుంచి యూట్యూబ్ లో టన్నుల కొద్దీ AI వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి. అంతేకాదు, సత్యం ఏదో అసత్యం ఏదో కూడా చెప్పలేనంతగా ఎఐ వీడియోలు ప్రబలుతున్నాయి. అంతేకాదు, కస్టపడి కంటెంట్ ను కొందరు క్రియేట్ చేస్తుంటే ఆ ఒరిజినల్ కంటెంట్ ను అప్పనంగా దోచేస్తున్నారు. అందుకే, ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్స్ కి ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి యూట్యూబ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ కొత్త రూల్స్ జూలై 15వ తేదీ నుంచి అమల్లోకి కూడా తీసుకు వస్తుందని కూడా తెలిపింది. ఇక నుంచి అప్లోడ్ చెస్ వీడియోలు ‘అతేంటిక్ కంటెంట్’ గా గుర్తించబడాలి. లేకుంటే, ‘ఇన్ అతేంటిక్ కంటెంట్’ గా గుర్తిస్తుంది. ఈ ఇన్ అతేంటిక్ కంటెంట్ పై ఎటువంటి మోనిటైజేషన్ వర్తించదు.
యూట్యూబ్ ఇలా చేయడం ద్వారా ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేసే క్రియేటర్స్ కు ఊతం అందించినట్లు అవుతుంది. అంతేకాదు, యూట్యూబ్ లో అతిగా ప్రవహిస్తున్న Ai కంటెంట్ ప్రవాహానికి అడ్డుకట్ట వేసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే, అతిగా క్రియేట్ అయ్యే రిపీట్ మరియు మాస్ కంటెంట్ ను కూడా కట్టడి చేయవచ్చు.
Also Read: ఫ్లిప్ కార్ట్ GOAT Sale నుంచి 55 ఇంచ్ టీవీ రేటుకే 65 ఇంచ్ QLED Smart Tv అందుకోండి.!
మొత్తానికి ఒంటికి మట్టి అంటకుండా, ఎటువంటి శ్రమ లేకుండా యూట్యూబ్ లో ఛానల్ నడుపుతున్న క్రియేటర్స్ కి ఇప్పుడు గడ్డు కాలం ఎదురైంది. యూట్యూబ్ ఛానల్ లో అతిగా ఇన్ అతేంటిక్ కంటెంట్ గుర్తిస్తే ఛానల్ డి మోనిటైజేషన్ కు గురవుతుంది. అయితే, ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్స్ కి ఎటువంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉండదు.