కొత్త QLED Smart Tv అదికూడా పెద్ద సైజులో ఉండే 65 ఇంచ్ టీవీ కావాలని చూస్తున్న వారికి ఫ్లిప్ కార్ట్ గుడ్ న్యూస్ అందించింది. ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ బిగ్ సేల్ GOAT Sale నుంచి భారీ స్మార్ట్ టీవీ డీల్ ఈరోజు అందించింది. ఈ ఆఫర్ ఈ సేల్ ద్వారా అందుబాటులోకి తీసుకు వచ్చింది మరియు ఈ ఆఫర్ తో కేవలం 55 ఇంచ్ టీవీ రేటుకే 65 ఇంచ్ స్మార్ట్ టీవీ అందుకునే అవకాశం అందించింది. ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ సేల్ నుంచి అందించిన ఈ బిగ్ డీల్స్ పై ఒక లుక్కేయండి.
Survey
✅ Thank you for completing the survey!
GOAT Sale QLED Smart Tv : డీల్
ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ నుంచి ఈరోజు ఈ బెస్ట్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ డీల్ అందించింది. అదేమిటంటే, KODAK ఇండియాలో రీసెంట్ గా అందించిన 65 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 65MT5033 పై ఈ డీల్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ నిన్న మొన్నటి వరకు రూ. 45,999 రూపాయల ధరకు సేల్ అయ్యింది.
అయితే, ఈరోజు నుంచి మొదలైన ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ అందించింది కేవలం రూ. 41,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీ రూ. 2,000 రూపాయల వరకు భారీ డిస్కౌంట్ అందుకునే బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా జత చేసింది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 39,999 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది.
ఈ కోడాక్ స్మార్ట్ టీవీ 65 ఇంచ్ పరిమాణం మరియు 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ తో వస్తుంది. ఈ క్యూలెడ్ స్మార్ట్ టీవీ డాల్బీ విజన్ మరియు HDR 10+ సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. అలాగే, డాల్బీ అట్మోస్ మరియు DTS సౌండ్ టెక్నలాజి సపోర్ట్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది.
ఈ కోడాక్ 65 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో నడుస్తుంది. ఇందులో 2 జీబీ ర్యామ్ మరియు 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కోడాక్ అందించింది. ఈ క్యూలెడ్ టీవీ గూగుల్ టీవీ OS పై నడుస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDMI, USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ మఱియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.