Moto G96 5G: బడ్జెట్ యూజర్ మనసు దోచుకునే ప్రైస్ అండ్ ఫీచర్స్ తో వచ్చేసింది.!
మోటోరోలా బడ్జెట్ సిరీస్ నుంచి ఈరోజు మరో కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది
మోటో జి 96 6జి ఫోన్ ను బడ్జెట్ యూజర్ మనసు దోచుకునే ప్రైస్ అండ్ ఫీచర్స్ తో అందించింది
మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది
Moto G96 5G : మోటోరోలా బడ్జెట్ సిరీస్ నుంచి ఈరోజు మరో కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే, మోటో జి 96 6జి స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను బడ్జెట్ యూజర్ మనసు దోచుకునే ప్రైస్ అండ్ ఫీచర్స్ తో అందించింది. ఈ ఫోన్ డిజైన్ మొదలుకొని ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ వరకు బడ్జెట్ యూజర్ ను ఆకట్టుకునేలా మోటోరోలా అందించింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధర, ఆఫర్స్ మరియు ప్రైస్ వంటి పూర్తి వివరాలు తెలుసుకోండి.
SurveyMoto G96 5G: ప్రైస్
మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ బేసిక్ 8 జీబీ + 128 జీబీ వేరియంట్ ను రూ. 17,999 ధరతో అందించింది. ఈ ఫోన్ హైఎండ్ వేరియంట్ 8 జీబీ +256 జీబీ వేరియంట్ రూ. 19,999 ధరతో లాంచ్ అయ్యింది. జూలై 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ మొదటి సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ యాష్ లేహ్ బ్లూ, కేట్లేయ ఆర్చిడ్, డ్రేస్డెన్ బ్లూ మరియు గ్రీనర్ పాశ్చర్స్ అనే నాలుగు అందమైన రంగుల్లో లభిస్తుంది.
Moto G96 5G: స్పెక్స్ అండ్ ఫీచర్లు
మోటో జి 96 5జి స్మార్ట్ ఫోన్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కలిగిన 6.7 ఇంచ్ 3D కర్వుడ్ pOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు SGS Eye ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. మోటోరోలా ఈ ఫోన్ ని వేగాన్ లెథర్ తో ప్రీమియం డిజైన్ లో అందించింది మరియు ఈ ఫోన్ చాలా స్లీక్ గా కూడా ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7s Gen 2 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ చిప్ సెట్ కి జతగా 8 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటుంది.

ఈ మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్ వెనుక moto ai సపోర్ట్ కలిగిన గొప్ప కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 50MP Sony LYT – 700C మెయిన్ సెన్సార్ మరియు 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన కెమెరా మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్, AI కెమెరా ఫీచర్స్ తో పాటు చాలా కెమెరా ఫిల్టర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా కలిగి ఉంటుంది.
Also Read: 6 వేల బడ్జెట్ లో మీ Smart tv కోసం సింపుల్ అండ్ పవర్ ఫుల్ Soundbar డీల్ కోసం చూస్తున్నారా.!
మోటో జి 96 5జి స్మార్ట్ ఫోన్ 5500 mAh బిగ్ బ్యాటరీ మరియు 33W Turbo Power ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ స్మార్ట్ కనెక్ట్ ఫీచర్ కలిగి ఉంటుంది మరియు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది.