Kodak – Jio Tele Series: అతి చవక ధరలో 43 ఇంచ్ QLED Smart Tv వచ్చేసింది.!

HIGHLIGHTS

Kodak - Jio Tele Series నుంచి అతి చవక ధరలో 43 ఇంచ్ QLED Smart Tv వచ్చేసింది

బడ్జెట్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ట్రెండ్ కు అనుగుణంగా ఈ కొత్త స్మార్ట్ టీవీని కొడాక్ అందించింది

ఇది 300 కంటే ఎక్కువ లైవ్ ఛానళ్లకు ఉచిత యాక్సెస్ కూడా అందిస్తుంది

Kodak – Jio Tele Series: అతి చవక ధరలో 43 ఇంచ్ QLED Smart Tv వచ్చేసింది.!

Kodak – Jio Tele Series నుంచి అతి చవక ధరలో 43 ఇంచ్ QLED Smart Tv వచ్చేసింది. భారత మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న బడ్జెట్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ట్రెండ్ కు అనుగుణంగా ఈ కొత్త స్మార్ట్ టీవీని కొడాక్ అందించింది. మార్కెట్లో 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ సాధారణ కంటే కూడా ఈ టీవీని మరింత తక్కువ ధరలో లాంచ్ చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Kodak – Jio Tele Series QLED Smart Tv: ప్రైస్

కొడాక్ జియో టెలీ సిరీస్ స్మార్ట్ టీవీని ఇండియాలో బడ్జెట్ ధరలో విడుదల చేసింది. ఈ టీవీ 43 ఇంచ్ సైజులో మాత్రమే లభిస్తుంది మరియు ఈ స్మార్ట్ టీవీని రూ. 18,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో కొడాక్ లాంచ్ చేసింది. ఈరోజు నుంచి ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ టీవీని BOBCARD EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ టీవీ కేవలం రూ. 17,499 రూపాయల అతి చవక ధరకు లభిస్తుంది. Buy From Here

Kodak – Jio Tele Series QLED Smart Tv: ఫీచర్స్

ఈ కొడాక్ జియో టెలీ సిరీస్ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ సైజు పరిమాణం మరియు 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ కొడాక్ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2 జీబీ ర్యామ్ మరియు 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ Jio TV OS పై పని చేస్తుంది మరియు ఇది AI రికమెండేడ్ కంటెంట్ అందిస్తుంది. ఇది 300 కంటే ఎక్కువ ఉచిత లైవ్ ఛానళ్లకు యాక్సెస్ కూడా అందిస్తుంది.

Kodak - Jio Tele Series QLED Smart Tv

ఈ కొడాక్ లేటెస్ట్ 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ సపోర్ట్ తో వస్తుంది మరియు టోటల్ 40W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, USB, HDMI, AV ఇన్ మరియు ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది. ఈ కొడాక్ 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఫుల్ ఫంక్షన్ వాయిస్ రిమోట్ తో కూడా వస్తుంది.

Also Read: Vivo X200 FE: చేతిలో ఇమిడిపోయే కాంపాక్ట్ డిజైన్ అండ్ పవర్ ఫుల్ ZEISS కెమెరాతో లాంచ్ అవుతోంది.!

ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీ నెట్ ఫ్లిక్స్, జియో హాట్ స్టార్, ప్రైమ్ వీడియో, సోనీ లివ్, జీ5, యూట్యూబ్ మరియు MX ప్లేయర్ వంటి అనేక యాప్స్ కి కూడా ఈ టీవీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo