Nothing Phone 3 ఫోన్ ఆపాదమస్తకం సరికొత్త వివరాలతో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

Nothing Phone 3 స్మార్ట్ ఫోన్ ను ఈరోజు నథింగ్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసింది

ఈ ఫోన్ ను ఆపాదమస్తకం సరికొత్త వివరాలతో లాంచ్ చేసింది

ఇది ఫోన్ కమ్యూనికేట్ చేసే విధానాన్ని కొత్తగా మారుస్తుందని నథింగ్ తెలిపింది

Nothing Phone 3 ఫోన్ ఆపాదమస్తకం సరికొత్త వివరాలతో లాంచ్ అయ్యింది.!

Nothing Phone 3 స్మార్ట్ ఫోన్ ను ఈరోజు నథింగ్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసింది. ఈ ఫోన్ ను ఆపాదమస్తకం సరికొత్త వివరాలతో లాంచ్ చేసింది. ఈ మత వాడటానికి ముఖ్య కారణం ఈ ఫోన్ యొక్క సరికొత్త డిజైన్ అని చెప్పవచ్చు. ఆఫ్ కోర్స్ డిజైన్ తో పాటు ఈ ఫోన్ కలిగిన కొత్త ఫీచర్స్ కూడా ఇందుకు కారణం అనుకోండి. మరింకెందుకు ఆలస్యం నథింగ్ ఫోన్ 3 ధర, ఆఫర్స్ మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం పదండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Nothing Phone 3 : ఫీచర్స్

నథింగ్ ఈ ఫోన్ ను సరికొత్త డిజైన్ తో అందించింది. ఈ ఫోన్ లో వెనుక 489 మైక్రో LED లు కలిగిన Glyph Matrix కలిగిన యూనిక్ డిజైన్ తో ఈ ఫోన్ ఉంటుంది. ఇది కటింగ్ ఎడ్జ్ సెకండ్ స్క్రీన్ మరియు ఇది ఫోన్ కమ్యూనికేట్ చేసే విధానాన్ని కొత్తగా మారుస్తుందని నథింగ్ తెలిపింది.

ఈ ఫోన్ లో 6.67 ఇంచ్ AMOLED Flexible LTPS స్క్రీన్ ను అందించింది. ఈ స్క్రీన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 120Hz రిఫ్రెష్ రేట్, HDR 10+ సపోర్ట్, 1.5 రిజల్యూషన్ మరియు 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఇది ఇప్పటి వరకు నథింగ్ నుంచి వచ్చిన అన్ని ఫోన్ లలో గరిష్టంగా బ్రైట్నెస్ కలిగిన ఫోన్ గా నిలుస్తుంది.

Nothing Phone 3

నథింగ్ ఫోన్ 3 స్మార్ట్ ఫోన్ ను Snapdragon 8s Gen 4 ఆక్టాకోర్ చిప్ సెట్ తో అందించింది. ఇది 3.2 GHz క్లాక్ స్పీడ్ కలిగి గొప్ప పర్ఫార్మెన్స్ అందించే చిప్సెట్. దానికి జతగా 16 జీబీ ర్యామ్ మరియు 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ నథింగ్ OS 3.5 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 15 OS పై నడుస్తుంది. ఈ ఫోన్ ఇది గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ మరియు IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో చాలా గట్టిగా ఉంటుంది.

ఈ ఫోన్ ఆప్టిక్స్ పరంగా వెనుక మూడు 50 MP కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఇందులో, 50MP ప్రధాన సెన్సార్, 50MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 50MP పెరిస్కోప్ కెమెరా ఉంటాయి. అంతేకాదు, ఈ ఫోన్ ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ అన్ని కెమెరాలు కూడా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటాయి మరియు గొప్ప AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటాయి.

ఈ నథింగ్ కొత్త ఫోన్ 5500 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 65W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్లెస్ ఛార్జింగ్, 5W వైర్లెస్ రివర్స్ ఛార్జింగ్ మరియు 7.5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందించింది.

Also Read: RailOne App: రైలు ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని సేవలకు ఒకే పరిష్కారం తో కొత్త యాప్ లాంచ్.!

Nothing Phone 3 : ప్రైస్

నథింగ్ ఈ ఫోన్ ను ప్రీమియం ఫీచర్స్ మాత్రమే కాదు ప్రీమియం ప్రైస్ తో కూడా లాంచ్ చేసింది. ఈ ఫోన్ బేసిక్ 12 జీబీ + 256 జీబీ వేరియంట్ ను రూ. 79,999 రూపాయల ధరలో మరియు ఈ ఫోన్ హై ఎండ్ 16 జీబీ + 512 జీబీ వేరియంట్ ను రూ. 89,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది.

ఆఫర్స్

ఈ ఫోన్ పై HDFC బ్యాంక్ డెబిట్ / క్రెడిట్ EMI, ICICI బ్యాంక్ మరియు IDFC బ్యాంక్ కార్డ్ పేమెంట్ పై రూ. 5,000 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఫోన్ ఇండియా ప్రీ ఆర్డర్స్ కూడా ఈరోజు నుంచే ప్రారంభించింది. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ నుంచి ప్రీ బుక్ చేసుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo