Gemini CLI : కొత్త ఓపెన్ సోర్స్ AI ఏజెంట్ అందించిన గూగుల్.!
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ తన యూజర్ కోసం కొత్త ఓపెన్ సోర్స్ AI ఏజెంట్ ని అందించింది
అదే జెమినీ CLI ఏజెంట్ మరియు యూజర్ కి సహాయం గా అందించింది
సింపుల్ ప్రాంప్ట్ నుంచి మోడల్ కు ఇది నేరుగా మార్గం సుగమం చేస్తుంది
Gemini CLI : ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ డెవలపర్ల కోసం కొత్త ఓపెన్ సోర్స్ AI ఏజెంట్ ని అందించింది. అదే జెమినీ CLI ఏజెంట్ మరియు దీన్ని డెవలపర్ తో పాటు యూజర్ సహాయం గా అందించింది. సింపుల్ ప్రాంప్ట్ నుంచి మోడల్ కు ఇది నేరుగా మార్గం సుగమం చేస్తుంది. తద్వారా ఈ, కొత్త ఫీచర్ మరింత ఎక్కువ అవకాశాలను డెవలపర్ కు అందించే విధంగా ఉంటుంది.
SurveyGemini CLI :
కమాండ్ లైన్ ఇంటర్‌ఫేస్ (CLI) అనేది డెవలపర్లకు గొప్ప సాధనం మాత్రమే కాదు ఇది మంచి హోమ్ లాంటిది. ఇది ఎక్కడి నుంచైనా డెవలపర్ టెర్మినల్ వ్యాప్తి మరియు పోర్టబిలిటీ పనిని పూర్తి చేయడానికి దీన్ని గో టు యుటిలిటీ గా చేస్తాయి. అంతేకాదు, డెవలపర్లు ఎక్కువగా టెర్మినల్‌పై ఆధారపడటం నడుస్తుందున ఇంటిగ్రేటెడ్ AI సహాయం కోసం డిమాండ్ కూడా పెరుగుతోంది.
అందుకే, గూగుల్ ఈ కొత్త జెమిని CLI ఫీచర్ లాంచ్ చేసింది. అది ఏమిటంటే, జెమినీ పవర్ ను నేరుగా మీ టర్మినల్ లోకి తీసుకొచ్చే ఓపెన్ సోర్స్ AI ఏజెంట్.
Gemini CLI : ఏమి చేస్తుంది?
ఈ కొత్త ఫీచర్ మీ జెమినీ కి తేలికైన యాక్సెస్ అందిస్తుంది. ఇది కంటెంట్ జెనరేషన్ నుంచి జఠిలమైన సమస్యల వరకు, కోడింగ్ నుంచి టాస్క్ మేనేజ్మెంట్ వరకు ఇలా ఒకటేమిటి అనేక పనుల కోసం విస్తృతంగా ఉపయోగించదగిన బంటుగా ఉంటుంది.
ఈ కొత్త ఓపెన్ సోర్స్ AI ఏజెంట్ ను గూగుల్ యొక్క AI కోడింగ్ అసిస్టెంట్ తో కూడా జత చేసినట్లు గూగుల్ తెలిపింది. ఈ చర్య ద్వారా, డెవలపర్స్ ఉచిత, స్టాండర్డ్ మరియు ఎంటర్‌ప్రైజ్ కోడ్ అసిస్ట్ ప్లాన్స్ పై ఉన్న అన్ని VS కోడ్ మరియు జెమిని CLI రెండింటిలోనూ ప్రాంప్ట్-డ్రైవెన్, AI-ఫస్ట్ కోడింగ్‌ను పొందుతారని గూగుల్ తెలిపింది.
Also Read: Motorola Upcoming Phone ఇండియా లాంచ్ అనౌన్స్ చేసిన మోటోరోలా.!
ఈ ఎలా ఉపయోగించాలి?
జెమిని CLI ను ఉచితంగా ఉపయోగించడానికి పర్సనల్ గూగుల్ అకౌంట్ తో లాగిన్ అయితే సరిపోతుంది. ఇక్కడ లాగిన్ అవ్వగానే జెమినీ కోడ్ అసిస్టెంట్ లైసెన్స్ అందిస్తుంది. ఈ ఉచిత లైసెన్స్ తో జెమిని లేటెస్ట్ ప్రీమియం వెర్షన్ Gemini 2.5 Pro కి కూడా యాక్సెస్ లభిస్తుంది.