vivo T4 Lite 5G : వివో అతి చవక 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది.!
ఈరోజు వివో ఇండియాలో అతి చవక ధరలో 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది
vivo T4 Lite 5G కేవలం 10 వేల రూపాయల బడ్జెట్ ధరలో స్టన్నింగ్ స్పెక్స్ షీట్ తో లాంచ్ అయ్యింది
ఇప్పటి వరకు వివో విడుదల చేసిన స్మార్ట్ ఫోన్లలో ఈ ఫోన్ అత్యంత చవకైన ఫోనుగా నిలిచింది
vivo T4 Lite 5G : ఈరోజు వివో ఇండియాలో అతి చవక ధరలో 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఇప్పటి వరకు వివో విడుదల చేసిన స్మార్ట్ ఫోన్లలో ఈ ఫోన్ అత్యంత చవకైన ఫోనుగా నిలిచింది. అదే, వివో టి 4 లైట్ 5జి స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ కేవలం 10 వేల రూపాయల బడ్జెట్ ధరలో స్టన్నింగ్ స్పెక్స్ షీట్ తో లాంచ్ అయ్యింది.
Surveyvivo T4 Lite 5G : ప్రైస్
వివో ఈ ఫోన్ కేవలం రూ. 9,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 4GB + 128GB వేరియంట్ ఈ ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 6GB + 128GB వేరియంట్ ను రూ. 10,999 ధరతో మరియు హై ఎండ్ 8GB + 256GB వేరియంట్ ను కూడా కేవలం రూ. 12,999 రూపాయల ధరతో లాంచ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.
ఆఫర్
వివో ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 500 రూపాయల ఇన్స్టాంట్ డిస్కౌంట్ అఫర్ అందించింది. ఈ ఫోన్ ను HDFC మరియు SBI క్రెడిట్ కార్డ్ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ కొనేవారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. జూలై 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ మొదటి సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు వివో అఫీషియల్ సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
vivo T4 Lite 5G : ఫీచర్స్
వివో ఈ స్మార్ట్ ఫోన్ 6.74 ఇంచ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ HD ప్లస్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 1000 నిట్స్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimesnsity 6300 5జి చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 8 GB ర్యామ్ మరియు 256GB హెవీ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో 50MP Sony AI మెయిన్ సెన్సార్ మరియు 2MP బొకే సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ మరియు ముందు 5MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ చాలా వివో కెమెరా ఫిల్టర్స్ తో పాటు AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మిలటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ మరియు IP 64 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ భారీ 6000 mAh బ్యాటరీ మరియు 15W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: అండర్ రూ. 5,000 బడ్జెట్ ధరలో బెస్ట్ Dolby Soundbar కోసం చూస్తున్నారా.!
ఈ ఫోన్ Funtouch OS 15 సాఫ్ట్ వేర్ తో Android 15 OS తో వస్తుంది. ఈ ఫోన్ ను ప్రిజం బ్లూ మరియు టైటానియం గోల్డ్ రెండు రంగుల్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ మరియు లైట్ వెయిట్ తో ఆకట్టుకుంటుంది.