Google Photos లో కొత్త AI వీడియో ఎడిటింగ్ టూల్స్ జత చేసిన గూగుల్.!

HIGHLIGHTS

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒకరి ఫోన్ లో ఈ యాప్ కచ్చితంగా ఉంటుంది

గూగుల్ ఫొటోస్ లో కొత్తగా AI వీడియో ఎడిటింగ్ టూల్స్ జత చేసినట్లు చెబుతోంది

గూగుల్ ఫొటోస్ లో గూగుల్ కొత్తగా AI-Powered ఎడిటింగ్ టూల్స్ జత చేసింది

Google Photos లో కొత్త AI వీడియో ఎడిటింగ్ టూల్స్ జత చేసిన గూగుల్.!

Google Photos అంటే తెలియని వారుండరు అంతగా గూగుల్ ఫోటోస్ అందరి సుపరిచిత మయ్యింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒకరి ఫోన్ లో ఈ యాప్ కచ్చితంగా ఉంటుంది. ఈ ఫీచర్ iOS లో అందుబాటులో ఉంది. యూజర్ మల్టీ మీడియా లను క్లౌడ్ బేస్ లో భద్రపరిచే గూగుల్ యొక్క సర్వీస్ గా ఈ గూగుల్ ఫోటోస్ చాలా కాలంగా అందరికీ పరిచయమే. ముందుగా ఉచితంగా గూగుల్ ఆఫర్ చేసిన ఈ గూగుల్ ఫోటోస్ అన్లిమిటెడ్ స్టోర్ ఇటీవల పరిమితం చేయబడింది. అయితే, పైడ్ ప్లాన్స్ తీసుకొచ్చిన తర్వాత గూగుల్ ఫొటోస్ లో కొత్త ఫీచర్స్ చాలా వేగంగా అందిస్తోంది. ఇప్పుడు యూజర్ల కోసం గూగుల్ ఫొటోస్ లో కొత్తగా AI వీడియో ఎడిటింగ్ టూల్స్ జత చేసినట్లు చెబుతోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Google Photos

గూగుల్ ఫొటోస్ లో గూగుల్ కొత్తగా AI-Powered ఎడిటింగ్ టూల్స్ జత చేసింది. ఇప్పటి వరకు అందించిన ఫీచర్స్ తో పాటు ఈ కొత్త ఫీచర్ ను యూజర్ల కోసం జత చేసింది. రీ ఇమాజిన్, ఆటో ఫ్రేమ్ మరియు AI ఎన్ హెన్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. వీటిలో రీ ఇమాజిన్ ఫీచర్ తో యూజర్ కోరుకున్న ఫోటోలో కొత్త ఎలిమెంట్ ను కేవలం టెక్స్ట్ ఇస్తే సరిపోతుంది. రెండవ ఫీచర్ ఆటో ఫ్రేమ్ తో జనరేటివ్ AI ఉపయోగించి ఇమేజ్ ను బట్టి ఫోటో ఫ్రేమ్ ను అడ్జస్ట్ చేస్తుంది. ఇక మూడవ ఫీచర్ AI ఎన్ హెన్స్ విషయానికి వస్తే ఈ ఫీచర్ తో ఫోటో ను మరింత ఉన్నతమైన కలర్స్ మరియు షార్ప్ తో గొప్ప ఫోటో గా మార్చి అందిస్తుంది.

Google Photos

ఇది మాత్రమే కాదు గూగుల్ ఫొటోస్ లో కొత్తగా Ultra HDR ఫీచర్ ను కూడా జత చేసింది. ఈ ఫీచర్ పాట ఫోటోలను మంచి బ్రైట్నెస్ మరియు కలర్ రేంజ్ తో గొప్ప అప్ స్కేల్ చేస్తుంది. అంటే, మీ పాత ఫోటోలను కొత్తగా రీ క్రియేట్ చేసి అందిస్తుంది. దీనితో పాటు మరో గొప్ప ఫీచర్ కూడా అందించింది. అదే QR Code ఆల్బమ్ షేరింగ్. గూగుల్ ఫోటోస్ ఫోటోలు ఈజీగా షేర్ చేయడానికి వీలుగా ఈ ఫీచర్ అందించింది. కావాల్సిన ఫోటోలు సెలెక్ట్ చేసి క్యూఆర్ కోడ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ క్యూఆర్ కోడ్ ను షేర్ చేయడం ద్వారా ఈ ఫోటోలు నచ్చిన వారితో ఈజీగా పంచుకునే అవకాశం ఉంది.

Also Read: Single OTT: శ్రీవిష్ణు హ్యూమర్ తో తెగ నవ్వించిన సింగిల్ ఓటీటీలో రిలీజ్ అయ్యింది.!

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo